రిగ్గింగ్ చేస్తే తప్ప జగన్ గెలవలేడా?

posted on: May 7, 2014 5:58PM

 

 

 

సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఈ నియోజకవర్గంలో వైపాకా కార్యకర్తలు స‌ృష్టించిన బీభత్సం ఇంతా అంతా కాదు. ఓటర్లను ప్రలోభపెట్టడం దగ్గర్నుంచి బూత్‌ల్ని ఆక్రమించుకుని రిగ్గింగ్ చేయడం వరకు అన్ని ఎలక్షన్ల అవలక్షణాలను ప్రదర్శించారు. వీటిలో ఇతర పార్టీల నాయకుల మీద దాడి చేయడం, పోలింగ్ సిబ్బంది మీద దాడి చేయడం లాంటి ఘనకార్యాలు కూడా వున్నాయి. అయితే ఇవన్నీ జగన్ పార్టీ ఎందుకు చేయించిందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నలా మిగిలింది.

 

పులివెందుల నియోజకవర్గంలో జగన్ గెలవడనే అనుమానం ఎవరికీ లేదు. ఈ నియోజకవర్గం వైఎస్సార్ కుటుంబ నియోజకవర్గంగా పేరు పొందింది. ఇక్కడి నుంచి వైఎస్సార్ కుటుంబీకులు ఎవరు పోటీ చేసినా సునాయాసంగా గెలుస్తారన్న అభిప్రాయం అందరిలోనూ వుంది. మరి సులభంగా గెలిచే స్థానం అయినప్పటికీ ఇక్కడి వైకాపా కార్యకర్తలు ఎందుకు హడావిడి చేశారో అర్థం కాని విషయం. ఒకవేళ వైఎస్ జగన్‌కి ఇక్కడి నుంచి ఓడిపోతానేమోనన్న భయం పట్టుకుందేమోనని అనుమానాలు వస్తున్నాయి. తాను పులివెందులలో రిగ్గింగ్ చేస్తే తప్ప గెలవలేనన్న భయంతోనే ఇక్కడ హడావిడి చేయించాడా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానని ఉబలాటపడినట్టు.. తన  కుటుంబ నియోజకవర్గంలోనే గెలవననే అనుమానం వున్న జగన్ రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కనడమేంటో ఆయనకే తెలియాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...