జగన్ పర్యటనలో అపశ్రుతి...వైసీపీ కార్యకర్త మృతి
posted on: Feb 6, 2026 4:46PM
.webp)
ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం పరిధిలో జరిగిన జగన్ ర్యాలీలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ర్యాలీ సందర్భంగా బైక్‌పై స్టంట్ చేస్తూ అదుపు తప్పిన యువకుడు రోడ్డుపై ఉన్న బార్ గేట్‌ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతుడిని భార్గవ్‌గా గుర్తించారు. అతడు ఇబ్రహీంపట్నం కొత్తగేట్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్ధారించారు.
ర్యాలీలో పాల్గొన్న సమయంలో బైక్‌పై ప్రమాదకరంగా స్టంట్లు చేయడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ర్యాలీ ఉత్సాహంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రాణాంతకంగా మారిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. యువకుడి మరణంతో వారి కుటుం బంలో విషాదఛాయలు అలుముకున్నాయి.



.webp)


