జగన్ ఫోన్ కహానీ!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాను ఏం మాట్లాడినా జనం నమ్మేస్తారనుకుంటారు. కాదు కాదు నమ్మితీరాలని భావిస్తారు.  అందుకే ఆయన ఇసుమంతైనా సంకోచం లేకుండా తనకు అసలు ఫొనే లేదని నిస్సంకోచంగా చెప్పేయగలరు. కానీ తన విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి ఇస్తూ కాంటాక్ట్ నంబర్ ఇచ్చి తీరాలన్న ఆదేశంతో ఓ నంబర్ ఇచ్చేసి లండన్ పర్యటనకు వెళ్లిపోయారు. ఆ పర్యటన పూర్తి చేసుకుని తిరిగి కూడా వచ్చేశారు. అయితే ఆయన సీబీఐకి ఇచ్చిన ఫోన్ నంబర్ ఆయనది కాదని తేలడంతో ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. అయినా కూడా పాత పాటనే పట్టకు వేళాడుతున్నారు. తనకు అసలు ఫోనే లేదని గట్టిగా చెప్పడమే కాదు.. తాను వాడేది సిబ్బంది ఫోన్లనే నని. అందుకే వారిలో ఒకరి ఫోన్ ను తన కాంటాక్ట్ నంబర్ గా ఇచ్చాననీ చెబుతున్నారు.  గతంలోనూ జగన్ సొంత ఫోన్ నెంబర్ ఇవ్వలేదని.. సిబ్బందిలో ఒకరి ఫోన్ నెంబర్లు ఇచ్చి విదేశీ పర్యటనకు వెళ్లారని జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ వాదనతో కోర్టు ఎలా స్పందిస్తుంది అన్నది పక్కన పెడితే..  అసలు జగన్ రెడ్డికి సొంతంగా అంటే వ్యక్తిగతంగా ఫోన్ లేదనడం నిజమేనా?  అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒక రాజకీయపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్ కు ఫోన్ లేదనడం, ఆయన అసలు ఫోన్ ను వినియోగించరనడం ఇసుమంతైనా నమ్మశక్యంగా లేదు. ఆయన ఏ అవసరం వచ్చినా సిబ్బంది ఫోన్లు వినియోగిస్తారన్నది మాటవరసకు నిజమే అని అనుకున్నా.. కుటుంబ సభ్యులతో మాట్లాడడానికీ వారి ఫోన్లే వినియోగిస్తారా? విదేశాలలో ఉండే కుమార్తెలు తండ్రికి ఫోన్ చేయాలన్నా.. ఆయన సిబ్బంది ఫోన్ కే కాల్ చేస్తారా?  అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తంగా జగన్ తన ఆస్తులను బినామీల పేర్ల మీద పెట్టినట్లే.. సొంతానికి వాడుకునే ఫోన్ ను కూడా బీనామీ పేరుతోనే తీసుకుని ఉంటారని పరిశీలకులు విశ్లేషి స్తున్నారు.  

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి పొందిన ఆయన.. కోర్టు షరతులను ఉల్లంఘించారని సీబీఐ అంటోంది. ఆయన ఇటీవలి లండన్ పర్యటన సందర్భంగా ఆయన ఇచ్చిన కాంటాక్ట్ నంబర్ ద్వారా ఆయనను కాంటాక్ట్ చేయడానికి కానీ, ట్రాక్ చేయడానికి కానీ అవకాశం లేకుండా పోయిందని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  దీంతో జగన్ ఫోన్ బాగోతం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu