జ‌గ‌న్ + భ‌జ‌న‌ - పార్టీ = ?

జ‌గ‌న్ ప్ల‌స్ భ‌జ‌న మైన‌స్ పార్టీ.. ఇదీ నెల్లూరు మాజీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి చేసిన కామెంట్స్ సారాంశం. జ‌గ‌న్ చుట్టూ భ‌జ‌న  ప‌రులు పేరుకుపోయార‌నీ, ఆయ‌న వారి చెప్పుడు మాట‌లు విని నిండా మునిగిపోయార‌నీ, అప్పుడ‌ప్పుడూ ఆయ‌న్ను విమ‌ర్శించి, త‌ప్పు స‌రిదిద్దే వారి మాట‌లు కూడా వినాల‌ని హిత‌వు ప‌లికారు మేక‌పాటి. నిజానికి జ‌గ‌న్ లో అలాంటి మార్పు వ‌చ్చే అవ‌కాశ‌ముందా? అని చూస్తే అందుకు ఆస్కార‌మే లేద‌ని అంటారు ఆయ‌న గురించి బాగా తెలిసిన వారు.

జ‌గ‌న్ చుట్టూ ఉన్న కోటరీలో కీ ప‌ర్స‌న్ అయిన విజ‌య‌సాయి రెడ్డి ఈ బాధ ప‌డ‌లేక ఆయ‌న్ను విడిచి వెళ్లిపోయారు.   పార్టీకి దూరంగా మ‌స‌లుతున్నారు. ఇక మిగిలింది స‌జ్జ‌ల‌, ధ‌నుంజ‌య‌రెడ్డి త‌దిత‌రులు. జ‌గ‌న్ ది బాగా ఇగో ఉన్న కేరెక్ట‌రైజేష‌న్. ఆయ‌న త‌న‌కు ఏది అనిపిస్తే అది చేయ‌డం ఒక అల‌వాటు. ఊరికే  వచ్చి ఇచ్చే ఉచిత స‌ల‌హాలు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప‌ట్టించుకోరు. అది ఆయ‌న ఇగోయిస్టిక్ మైండ్ సెట్ కి సంబంధించిన విష‌యం. ఒక వేళ ఎవ‌రి నుంచైనా స‌ల‌హా తీసుకుంటే.. కొన్ని కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి పీకే వంటి వారిని నియ‌మించుకుని వారి నుంచైనా ఏదైనా స‌ల‌హా సూచ‌న పాటిస్తారేమోగానీ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ త‌న క‌న్నా కింది స్థాయి వ్య‌క్తుల మాట‌లు విన‌డం గానీ వారికి  ప్ర‌యారిటీ ఇవ్వ‌డం గానీ ఉండ‌దు. జ‌గ‌న్ ది అంతా వ‌న్ వే. 

త‌న పార్టీలో ఉన్న లీడ‌ర్ల‌ను జ‌గ‌న్ కేవ‌లం పావులుగానే భావిస్తారు. తాను ఎక్క‌డ ఎవ‌ర్ని నిల‌బెడితే వారక్క‌డి నుంచి  గెలుస్తారంటే  అదంతా త‌న చ‌రిష్మా యేననీ, వారికంటూ సొంత  ప్ర‌తిభా పాట‌వాలుండ‌వనే నమ్ముతారు జగన్. అందుకే గ‌త ఎన్నిక‌ల్లో ఒక రాజ‌కీయ చ‌ద‌రంగం ఆడి బొక్క‌బోర్లా ప‌డ్డారు.  

జ‌గ‌న్ కి ఒక మ‌నిషికి విలువ ఇవ్వాల‌న్న విషయం కనీసం తెలియదంటారు ఆయనకు సన్నిహితంగా మెలిగిన వారు.  ఇదే విషయాన్ని  విజ‌య‌సాయిరెడ్డి ఇప్ప‌టికే ఎన్నోసార్లు బాహ‌టంగానే చెప్పారు కూడా.  జ‌గ‌న్ తో పోలిస్తే తానెంతో సీనియ‌ర్ అయినా.. నిల‌బ‌డే మాట్లాడాల్సి ఉంటుంద‌ని విజయసాయిరెడ్డి చెప్పుకోవడమూ  తెలిసిందే. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను కూడా జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కూ గౌర‌వించిన దాఖలాలు లేవు. ఈ విష‌యంలో ర‌ఘురామ మ‌రింత క్లారిటీగా చెప్ప‌గ‌ల‌రు. ఆయ‌నంతగా జ‌గ‌న్ ని వ్య‌తిరేకించారంటే అందుకు కార‌ణం ఈ విలువ‌లేని త‌న‌మే.

సాధార‌ణంగా చిన్న పిల్ల‌ల నుంచి వృద్ధుల వ‌ర‌కూ ప్ర‌తి ఒక్కరికీ వారి వారి  స్తోమ‌త‌కు త‌గ్గ‌ట్టు అంతో ఇంతో నాలెడ్జ్ ఉంటుంది. కొన్ని సార్లు ఆ విష‌య ప‌రిజ్ఞానం ఎన్నో వింత‌లను న‌మోదు చేస్తుంద‌ని న‌మ్మే ర‌కం కాదు జ‌గ‌న్ రెడ్డి. ఆయ‌నదంతా త‌న తాత స్టైల్. వీడ్ని కొట్టు- వాడ్ని ప‌ట్టు- ఇదిగో వీడికి పెట్టు. అనుకుంటారు త‌ప్ప‌.. మ‌న‌క‌న్నా మించి మ‌న‌కు తెలివితేట‌లు నేర్పేవారు మ‌న కింది స్థాయి  వ్య‌క్తుల్లో ఉంటార‌న్న న‌మ్మ‌కాలు గానీ, అభిప్రాయాలు గానీ జ‌గ‌న్ లో ఉండ‌వు. ఉండ‌బోవు. 

ఆయ‌న‌దంతా ఒక‌టే సిద్ధాంతం. పైన దేవుడున్నాడు. కింద  జ‌నం ఉన్నారు. మ‌ధ్య‌లో మ‌నం  ఈ ఇద్ద‌రి ద్వారా ఇక్క‌డ చ‌క్రం తిప్పుతుంటాం అనుకునే బాప‌తు. ఒక వేళ మేక‌పాటి చెప్పిన‌ట్టు ఎవ‌రైనా ఒక‌రు చెప్పిన స‌ల‌హా సూచ‌న‌ల కార‌ణంగా ఏదైనా పార్టీకి ల‌బ్ధి చేకూరిందే అనుకుంటే.. జ‌గ‌న్ లోని ఇగో దాన్ని ఎంత మాత్రం ఒప్పుకోదు. 

జ‌గ‌న్ ఫీలింగ్స్ లో ఇది జ‌నం  కోసం పార్టీ పెట్టిన  పార్టీ అని గానీ వారికి ల‌బ్ధి చేకూరాల‌ని పెట్టిన పార్టీ అనిగానీ భావించరు. త‌న తండ్రి మీద‌నే ఒక ఈర్ష్య, అసూయ క‌లిగిన  వ్య‌క్తి జ‌గ‌న్. ఈ విష‌యం  ఆయ‌నే స్వ‌యంగా చెప్పుకొచ్చారు. తాను ఓదార్పు యాత్ర‌ల‌కు వెళ్లిన‌పుడు త‌న తండ్రి  ఫోటో వారిళ్ల‌లో దేవుడి ఫోటోల ప‌క్క‌న  పెట్టార‌నీ.. ఆ స్థానంలో త‌న ఫోటో ఉండాల‌న్న‌ది ఆయ‌న ప్ర‌గాఢ‌మైన‌ కోరిక‌.  అందుకోసం తాను అధికారంలో ఉండగా ఎడా పెడా, ఇబ్బ‌డి ముబ్బ‌డిగా జ‌నానికి రాష్ట్ర ఖ‌జానా  సొమ్ము దోచి పెట్టి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడానికి కూడా వెనుకాడలేదు జగన్. 

అదే సొమ్ము రాష్ట్రం చెంత ఉంటే, దాంతో ఈ పాటికి అమ‌రావ‌తి రాజ‌ధానితో పాటు పోల‌వ‌రం కూడా పూర్త‌య్యి ఉండేది.  అలాంటి జగన్ ఇప్పుడు  కార్య‌క‌ర్త‌ల కోసం తాను మారుతున్న‌ట్టు చెబుతున్నా.. జ‌గ‌న్ కున్న మాన‌సిక స్థితిని బ‌ట్టి చూస్తే అందులోనూ వ‌న్ వే యేఉంటుంది త‌ప్ప‌, ప్ర‌జాస్వామిక విధాన  స‌ర‌ళిని  ఊహించ‌డం వెర్రిత‌న‌మే అవుతుందంటున్నారు పరిశీలకులు.  అటువంటి జగన్ కనుక రాష్ట్రానికి మరో సారి సీఎం అయితే.. ఏపీని ఆయ‌న నామ‌రూపాల్లేకుండా చేస్తార‌న‌డంలో సందేహానికి తావులేదం టున్నారు విశ్లేషకులు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu