యధా నేత తదా పార్టీ

 

 

 

జగన్ కూడబెట్టిన అక్రమాస్తుల విలువ ఎంత ఉండొచ్చు? వైఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వేల కోట్లు ఎలా సంపాదించాడు? ఇవన్నీ సీబీఐకీ దొరకని భేతాళ ప్రశ్నలు. జగన్ పై మీడియాలో వచ్చిన, సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్లు ప్రకారం అయితే లక్షల కోట్లకు యువనేత పడగలెత్తాడు. ఈ (అవినీతి) ప్రచారం శృతి మించడంతో జగన్, టాటా,బిర్లా, అంబానీల సరసన చేరిపోయారు.

 

అయితే, జగన్ ఇంత డబ్బు ఎలా సంపాదించాడనే సంగతిని మరిచిన కొందరు జనాలు ఆయనను అభిమానించడం మొదలెట్టారు. దానితో వైకాపాలో ఆయన బాపతు నేతలు చాలా మంది చేరుతున్నారు. వైసీపీ కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి కుడిభుజంగా వ్యవహరిస్తున్న శ్రీధర్‌రెడ్డి..రాజమండ్రిలో బ్యాంకు లాకర్లను పగలగొట్టి సెక్యూరిటీ గార్డును చంపిన కేసులో నిందితులు. ఆ డబ్బుని అతను షర్మిల మరో ప్రజా ప్రస్తానం పాదయాత్రకు ఖర్చు చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరిచారు కూడా.



విశాఖలో దొంగనోట్ల మూటా నాయకురాలు మల్లిక కూడా జగన్ పార్టీలో చేరాడం, ఆమెను పోలీసులు అరెస్ట్ చేసిన తరువాత ఆమెతో తమ పార్టీకి సంబంధం లేదని వైకాపా ప్రకటించడం అందరికీ తెలిసిన సంగతే. ఇక గుంటూరులో (మేడికొండూరు) చెందిన మరో వైకాపా మహిళా నేత ధనేకుల కళ్యాణి, గుంటూరు బ్రాడీపేటలోని ఓ జువెలరీ దుకాణానికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత పేరుతో ఫోన్ చేసి లక్షలకు టోకరా వేసింది. ఈ విషయం పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.  ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో జగన్ పార్టీ టికెట్లు కొనుక్కున్న వారిలో ఎంత మంది గెలుస్తారో.. తెలంగాణా విడిపోగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరిని కొల్లగొడతారో, ఏమేమి అమ్మేస్తారో అనే ఆందోళనతో ఉన్నారు ప్రజలు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu