కూతుళ్లతో విదేశాల్లో జగన్ దంపతుల షాపింగ్

posted on: Apr 27, 2026 7:52PM

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ పర్యటనలో ఉన్నారు. కూతుళ్లతో కలిసి షాపింగ్ చేస్తూ కనిపించారు. బెంగళూరు నుంచి కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం యూరప్‌కు బయల్దేరిన జగన్, విదేశాల్లో కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. సాధారణంగా ఒకే విధమైన వస్త్రధారణలో కనిపించే ఆయన, ఈసారి భిన్నమైన స్టైల్‌లో ఆకట్టుకున్నారు.

దాదాపు 15 రోజుల పాటు లండన్‌లోనే రాజకీయాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకోనున్నారు. ముఖ్యంగా కూతుళ్లతో సమయం గడపనున్నారు. మే 10న తిరిగి బెంగళూరుకు చేరుకోనున్నారు. విదేశీ పర్యటన కోసం ఇప్పటికే సీబీఐ కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అందులో భాగంగా సెక్యూరిటీ డిపాజిట్, వ్యక్తిగత ఈ-మెయిల్, ఫోన్ నంబర్ వంటి వివరాలను కోర్టుకు సమర్పించారు.

మరోవైపు అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసును సీబీఐ కోర్టు విచారిస్తోంది. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటనలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. ఇక జగన్ కుమార్తెలు లండన్‌లో నివసిస్తున్నారు. వారిని కలిసేందుకు గతంలోనూ ఆయన యూకే పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటికీ సీబీఐ కోర్టు అనుమతితోనే విదేశీ పర్యటన చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...