జగన్ కు జలీల్ సవాల్.. అలా చేస్తే కాళ్లు పట్టుకొని రాజీనామా చేస్తా..!

posted on: Apr 14, 2018 4:15PM

 

వైసీపీ అధినేత జగన్ కనుక ప్రధానమంత్రి నరేంద్రమోడీని విమర్సిస్తే నా పదవికి రాజీనామా చేస్తా..? ఇంత పెద్ద సవాల్ విసిరింది ఎవరనుకున్నారా..?ఎవరో కాదు వైకాపా లో గెలిచి టీడీపీలో జాయిన్ అయిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్. పాదయాత్రలో భాగంగా జగన్ నేడు విజయవాడలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అయితే జగన్ విజయవాడలో అడుగుపెట్టిన నేపథ్యంలో జలీల్ ఖాన్ ఓ సవాల్ విసిరారు. పాదయాత్రలో కనుక జగన్ నోటి వెంట మోదీ దొంగ, బీజేపీ మోసం చేసింది అని ఒక్క మాట అంటే జగన్ కాళ్ళు పట్టుకొని..నా పదవికి రాజీనామా చేస్తానని జలీల్‌ఖాన్ సవాలు విసిరారు. ప్రత్యేక హోదా వస్తే ఇన్ కంటాక్స్ కట్టనవసరం లేదు అని చెప్పే జ్ఞానం లేని జగన్ ముఖ్యమంత్రిగా పనికి వస్తాడా? అని ఆయన అన్నారు. అక్కడితే ఆగకుండా... ముఖ్యమంత్రినే నడిరోడ్డుపై కాల్చిపారేయాలి అని వ్యాఖ్యానించిన జగన్.. రేపు ఆయన ముఖ్యమంత్రి అయితే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

 

అంతేకాదు మోడీపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. “పరిపాలన చేతగాక దద్దమ్మలా మోదీ దీక్ష చేసారని, పార్లమెంటును సజావుగా నడిపించలేని నరేంద్రమోదీ రాజీనామా చెయ్యాలి. దళితులు, మైనార్టీల మీద దాడులు చేస్తున్నా కేంద్రం చోద్యం చూస్తుంది.” అని ఆయన అన్నారు. మరి జలీల్ ఖాన్ సవాల్ ను జగన్ స్వీకరిస్తాడో..? లేదో..? చూద్దాం.

google-ad-img
    Related Sigment News
    • Loading...