పట్టిసీమపై క్షమాపణ చెప్పి అడుగుపెట్టు..
posted on: Apr 14, 2018 2:50PM
.jpg)
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా విజయవాడలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కనకదుర్గ వారధి వద్ద వైసీపీ శ్రేణులు పోటెత్తారు. జగన్ కు బ్రహ్మరథం పట్టారు. అశేష జనసందోహం మధ్య ఆయన నగరంలోకి అడుగుపెట్టారు. అయితే పార్టీ నేతలు కాబట్టి ఎలాగూ జగన్ కు ఘనస్వాగతం పలకడంలో ఆశ్చర్యం లేదు. కానీ.. కృష్ణా రైతులు మాత్రం జగన్ పై మండిపడుతున్నారు. దీనికి కారణం పట్టిసీమే.
పట్టిసీమకు, కృష్ణ కు సంబంధం ఏంటనుకుంటున్నారా..? ఏంటంటే... పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేయడానికి చంద్రబాబు చాలా కష్టపడ్డారు. కేవలం ఆరు నెలల్లో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి చరిత్ర సృష్టించారు. అయితే ఈ ప్రాజెక్టుకు జగన్ మాత్రం ఎప్పుడూ వ్యతిరేకమే. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఈ ప్రాజెక్టుపై విషం చిమ్ముతూనే వస్తున్నారు. ఇప్పుడు ఈ పట్టిసీమ నుంచి వచ్చిన నీరు కృష్ణాలో కలుస్తోంది. దీంతో కృష్ణరైతులు జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టిసీమ ప్రాజెక్టు కట్టి.. గోదావరి వాసులకు అన్నాయం చేస్తున్నారని... గోదావరి జిల్లాల వాళ్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు... అక్కడ ఆందోళనలు చేయించారు... కృష్ణాడెల్టా రైతుల పొట్టకొట్టాలని చూశారు.. కృష్ణా డెల్టాకు నీరిస్తూంటే.. శ్రీశైలం నీళ్లిస్తున్నారంటూ.. రాయలసీమలో ప్రజల్ని రెచ్చగొట్టాలని చూశారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఇక్కడ పాదయాత్రకు చేయడానికి వచ్చారని అంటున్నారు. అంతేకాదు... ఇప్పుడు పులివెందులలో కృష్ణా నీరు పారుతున్నాయంటే..అది పట్టిసీమ మహిమే... ఇప్పటికైనా తప్పు తెలుసుకో.. పట్టిసీమను వ్యతిరేకించినందుకు.. క్షమాపణ చెప్పి… కృష్ణా నీళ్లు..అదే పట్టిసమ నీళ్లు తలపై చల్లుకుని.. జిల్లాలోకి అడుగుపెట్టు అంటూ రైతులు జగన్ పై మండిపడుతున్నారు. మరి ఆరంభంలోనే హంసపాదు అన్న సామెతలాగ...ఎంట్రీలోనే అడ్డంకులు ఎదురైన జగన్ కు ముందు ముందు ఇంకెన్ని సమస్యలు వస్తాయో.






.webp)



