Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అరెరె... శశికళ ముందే జగన్ కు ఈ సలహా ఇవ్వాల్సింది....
posted on: Jan 25, 2018 5:05PM

వైసీపీ జగన్మోహన్ రెడ్డికి శశికళ సలహా ఇచ్చిందట. అదేంటీ... శశికళ ఏంటీ.. జగన్ కు సలహా ఇవ్వడం ఏంటీ అనుకుంటున్నారా...? జగనేమో ఒకపక్క ప్రజా సంకల్ప పాదయాత్రతో కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు.. మరోపక్క శశికళ అవినీతి కేసులో జైలులో శిక్ష అనుభవిస్తుంది... అలాంటిది... జగన్ కు శశికళ సలహా ఎప్పుడు ఇచ్చింది..? ఎలా ఇచ్చింది అనుకుంటున్నారా..? అయితే డైరెక్ట్ కాదులేండి.. ఇన్ డైరెక్ట్గ్ గా.. అసలు సంగతేంటంటే...
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం శశికళ నిత్యం వార్తలో ఉంటున్న సంగతి తెలిసిందే. అంతేకాదు శశికళ, ఆమె కుటుంబసభ్యలపై ఐటీ అధికారులు వరుస పెట్టి దాడులు చేస్తూనే ఉన్నారు. ఆ దాడుల్లో కోట్ల కొద్ది ఆస్తులు బయటపడుతున్న సంగతి కూడా విదితమే. ఇక ఈ దాడుల్లో భాగంగనే అధికారులు ఇటీవల పొయెస్ గార్డెన్‌లోని ‘అమ్మ’ జయలలిత నివాసంలో సోదాలు జరిపారు. ఇక ఈ సోదాల్లో కొన్ని కీలక పత్రాలు స్వాదీనం చేసుకున్నారు. కీలక పత్రాల ఆధారంగా ఈ స్కాం బయట పడింది. నిషేధిత గుట్కా విక్రయాలకు వీరు అవకాశం కల్పించినట్లు బయటపడింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో విచారణకు వచ్చే నెల 10న హాజరు కావాలని శశికళకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులిచ్చింది. ఈ నోటీసులు అందుకున్న శశికళ.. ఐటీ అధికారులకు ఓ సమాధానం పంపారు. ఆ సమాధానం చూసిన అధికారులు ఖంగుతిన్నారు. ఇంతకీ శశికళ చెప్పిన ఆసమాధానం ఏంటనుకుంటున్నారా..?
తాను మౌన వ్రతంలో ఉన్నానని, విచారణకు హాజరు కాలేనని.. వచ్చే నెల 20 వరకు మౌన వ్రతంలో ఉంటానని చెప్పారు. ఈ సమాధానంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు అవాక్కయ్యారు. అయితే ఇప్పుడు.. శశికళ సమాధానాన్ని జగన్ కు లింక్ పెట్టి పలు సెటైర్లు వేస్తున్నారు. శశికళ కు తెలివి జగన్ కు లేదు..శశికళ ఈ ఐడియా ముందే జగన్ కు ఇచ్చుంటే బావుండేది... జగన్ కూడా ప్రతి శుక్రవారం నాకు, మౌన వ్రతం అని చెప్పి విచారణని తప్పించుకోవచ్చు అంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా పోస్ట్ లు పెడుతున్నారు.. మరి అధికారులు ఇలాంటి వాటిని పట్టించుకుంటారా..? ఇలాంటి సాకులను నమ్ముతారా...? చూద్దాం ఏం జరుగుతుందో...






