పెద్ద తలకాయ కోసం వెయిటింగ్.. ఇంతకీ ఎవరబ్బా..
posted on: Nov 29, 2017 10:52AM

వైసీపీ పార్టీ నుండి ఇప్పటికే ఎంతోమంది కీలక నేతలు అధికార పార్టీ అయిన టీడీపీలోకి జంప్ అయి షాకిచ్చారు. తాజాగా టీడీపీపై ఎన్నో విమర్శలు గుప్పించి.. ఒకప్పుడు సీఎం తల నరుకుతా అని బహిరంగంగా ప్రకటించిన గిడ్డి ఈశ్వరి కూడా టీడీపీ కండువా కప్పుకుంది. ఇక గిడ్డి ఈశ్వరి చేరికతో ఈ సంఖ్య 23 కు చేరింది. ఇక పలువురు టీడీపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకుంటున్నట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా... ఇప్పుడు ఓ వార్త మాత్రం అటు వైసీపీలోనూ..ఇటు టీడీపీలోనూ హాట్ టాపిక్ గా మారింది.
అదేంటంటే.. మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ప్రకటనపై. “వైకాపాకు చెందిన ఒక పెద్ద తలకాయ కోసం ప్రయత్నిస్తున్నాం. అనేకరకాలుగా చర్చలు జరుపుతున్నాం. ‘అన్నిరకాలు’గా వారికోసం ప్రయత్నాలు చేస్తున్నాం. అది వర్కవుట్ అయితే దాదాపు మా లక్ష్యం వందశాతం పూర్తయినట్లే. ఇక అక్కడ మిగిలేది ఒకరో ఇద్దరో మాత్రమే,” అని ఆయన అన్నాడు. అంతేకాదు జగన్ పాదయాత్ర ముగిసే టైంకు వైసీపీలో ఆయనతో పాటు ఆయన తల్లి, చెల్లి, కొద్దిమంది బంధువులు మాత్రమే వైసీపీలో ఉంటారని ఆయన అన్నారుఅంతే ఇప్పుడు వైసీపీలో ఉన్న ఆ పెద్ద తలకాయ ఎవరబ్బా అని అందరూ చర్చించుకుంటున్నారు. కొంతమంది అయితే జగన్‌కు రైట్ హ్యాండ్, ఆయన చిన్ననాటి స్నేమితుడు అయిన రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అని అనుకుంటుండగా.. కొంతమంది మాత్రం... ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అని అనుకుంటున్నారు. పెద్దిరెడ్డి తరలిపోతే చిత్తూర్ జిల్లాలో వైకాపా ఖాళీ అవ్వడం ఖాయం. ఆయనతో పాటు ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా తరలిపోతారు. దీంతో వైసీపీలో ఒకటే టెన్షన్ పట్టుకుంది.
ఒకపక్క జగన్ మాత్రం పాదయాత్ర అంటూ పోతుంటే... మరోపక్క నేతలు ఒక్కోక్కరుగా పార్టీని వదిలి వెళుతున్నారు. పోనీ నేతలు పార్టీ మారే ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నా.. జగన్ వారిని బుజ్జగిస్తున్నారా అంటే అదీ లేదు... పోతే పోండి అన్నట్టు ఉంది ఆయన వ్యవహారం. జగన్ ఈ తీరువల్లే పార్టీ నేతలు అయోమయ స్థితిలో పడ్డారు. మరోపక్క అచ్చన్నాయుడు చేసిన వ్యాఖ్యలు. దీంతో వైకాపా పార్టీ నేతల గుండెల్లో గుబులు మొదలైంది. ఏంచెయ్యాలో పాలుపోని పరిస్థితిలో పడ్డారు. మరి చూద్దాం.. ఆ పెద్ద తలకాయ ఎవరో.. జగన్ కు ఎప్పుడు షాక్ తగులుతుందో...




.jpg)

.webp)



