ఇలా అయితే చాలా కష్టం జగన్...

posted on: Nov 27, 2017 10:42AM


ఒకపక్క జగన్  పాదయాత్రలు చేసుకుంటూ పోతుంటే.. మరోపక్క వైసీపీ నేతలు ఒక్కోక్కరుగా పార్టీని వదిలిపెడుతూ జగన్ కు షాకిస్తున్నారు. నేను మోనర్క్ ను... నేను ఎవ్వరి మాట వినను.. నామాటే అందరూ వినాలి అన్న పంథాతో ఉండే జగన్ వైఖరిపై విసుగుచెందిన నేతలు మొత్తం ఇప్పుడు పక్కపార్టీపై చూపులు చూస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది వైసీపీ నేతలు అధికార పార్టీలోకి వెళ్లారు. ఇప్పుడు తాజాగా మరో కీలక నేత టీడీపీ తీర్దం పుచ్చుకున్నారు. అది ఎవరో కాదు విశాఖ జిల్లా పాడేరు నియోజ‌క‌వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గిడ్డి ఈశ్వ‌రి.  జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభానికి కొద్ది రోజుల ముందు క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు గిడ్డి ఈశ్వరి. గిడ్డి ఈశ్వరితో పార్టీ మారిన వారి సంఖ్య 23 కు చేరింది. అయితే ఇప్పుడు మరికొంతమంది నేతలు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. 24, 25, 26 వికెట్లు కూడా త్వ‌ర‌లోనే ప‌డ‌నున్నాయ‌ని తెలుస్తోంది. వారిలో కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగ‌డ్డ ర‌క్ష‌ణ‌నిధి, క‌ర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే వై.సాయ‌ప్ర‌సాద‌రెడ్డి,  నెల్లూరు జిల్లా కావ‌లి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్ర‌తాప్‌కుమార్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అనంతపురం మాజీ ఎమ్మెల్యే బోడిమల్లు గుర్నాథరెడ్డి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. వీరు మాత్రమే కాదు.. ఇంకా కొంత మంది పార్టీ మారాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇంత మంది నేతలు పార్టీ మారుతున్నా.. నిమ్మకు నిరెత్తన్నట్టు జగన్ మాత్రం పాదయాత్ర చేసుకుంటూ పోతున్నాడు. కనీసం వాళ్లు పార్టీ మారుతున్నారు అని వాళ్లను బుజ్జగించడం కూడా చేయకుండా... అసలు పార్టీ ఎందుకు మారుతున్నారు అని కూడా అడగకుండా.. మారితే మారారులే అని పొగరుతో వ్యవహిస్తున్నాడు. మరి జగన్ తన వైఖరిని మార్చుకోకపోతే.. పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పార్టీలో నేతలనే పట్టించుకోని.. జగన్ ఎన్ని పాదయాత్రలు చేస్తే లాభం ఏంటి..? ప్రజల సమస్యలను మాత్రం పట్టించుకుంటారని గ్యారెంటీ ఏంటీ..

google-ad-img
    Related Sigment News
    • Loading...