జగన్ పై బాబు కొత్త ప్లాన్...
posted on: Nov 25, 2017 10:52AM
.jpg)
ఏంటో పాపం జగన్ ఒకపక్క ప్రజా సంకల్పం పేరుతో పాదయాత్ర అంటూ జనంలోకి వచ్చి కష్టపడుతున్నా.. కష్టాలు మాత్రం ఆయన్ని వదిలేలా కనిపించడంలేదు. గత కొద్దిరోజుల నుండి ఆయనకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. నంద్యాల ఉపఎన్నిక ఓటమి నుండి మొదలైంది జగన్ కు షాకులు తగలడం. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమి, కోర్టు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వకపోవడం..పార్టీలో కీలక నేతల జంపింగ్ లు, ఇక పాదయాత్ర మొదలుపెట్టిన రోజే ప్యారడైజ్ పేపరల్లో జగన్ పేరు ప్రస్తావనకు రావడం.. ఇలా షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో బాంబు పేలింది. అదేంటంటే.. . మనీలాండర్స్‌పై ఈడీ విడుదల చేసిన జాబితాలో జగన్‌తో ఉండటం. 31 షెల్ కంపెనీల ద్వారా రూ. 368 కోట్లు మనీ లాండరింగ్‌కు జగన్ పాల్పడినట్లు అందులో తెలుస్తోంది.
అయితే ఇప్పుడు జగన్ కు ఉన్న ఈ లూప్ హోల్స్ నే టీడీపీ పార్టీ ఇప్పుడు క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. దీనిపై చంద్రబాబు నేతలకు కొన్ని సూచనలు కూడా చేశారంట. ఈడీ విడుదల చేసిన జాబితాలో జగన్ పేరుంది... దీనిలో భాగంగానే ఇద్దరు ఇప్పటికే జైలుకు వెళ్లారు.. ఇక జగన్ కూడా జైలుకు వెళ్లేరోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోందని చంద్రబాబు పార్టీ నేతల దగ్గర ప్రస్తావించారట. అంతేకాదు.. ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన నాయకులకు సూచించారట. మనం రాజకీయంగా జగన్‌ను పట్టించుకోవలసిన పనిలేదు.. జగన్ ను గుడ్డిగా విమర్శించకుండా.. జగన్ కు సంబంధించిన కేసుల గురించి ప్రజల్లోకి తీసుకెళితే చాలని చిన్న సలహా కూడా ఇచ్చారట. మొత్తానికి జగన్ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి... ఏదో ప్రజల్ని తన వైపు తిప్పుకోవడానికి నానా కబుర్లు చెబుతుంటే... బాబు దానికి రివర్స్ లో జగన్ లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వేరే ప్లాన్ వేశారు.






.webp)



