జగన్ కే షాకిచ్చాడుగా..నెక్ట్స్ ఏంటీ..?

posted on: Nov 23, 2017 10:59AM

 

పార్టీ ఫిరాయించిన నేతలపై వేటు వేస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వస్తామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టి అసెంబ్లీ సమావేశాలు డుమ్మా కొడుతున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇది తాను పాదయాత్ర చేసుకోవడానికి పెట్టుకున్న కుంటి సాకు అని ఎవరిని అడిగినా టక్కున చెప్పేస్తారు. ప్రజా సంకల్పం పేరుతో జగన్ ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తాను అనుకున్నట్టే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా మరీ పాదయాత్ర చేస్తున్నారు. ఇక జగన్ ఆదేశాలు పాటించిన నేతలు కూడా అసెంబ్లీ సమావేశాలు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.

 

కానీ ఇప్పుడు సొంత పార్టీ నేతలే జగన్ కు షాకిచ్చారు.  సభకు హాజరుకాకూడదని నిర్ణయం తీసుకున్న జ‌గ‌న్‌కు ఆ పార్టీ బాపట్ల ఎమ్మెల్ల్యే కోన రఘుపతి షాక్ ఇచ్చారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీకి అయన హాజరయ్యి అందరికి షాక్ ఇచ్చారు. ఈ ఎస్టిమేట్స్ కమిటీలో ప్రభుత్వ సభ్యులతో పాటు ప్రతిపక్ష సభ్యులును కూడా భాగస్వామ్యం చేశారు అసెంబ్లీ స్పీకర్. ఈ క్రమంలోనే ఆయన ఈ సమావేశానికి హాజరయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు రఘుపతి అసెంబ్లీకి రావడంతో.. ఈయన జగన్ కు తెలిసి అసెంబ్లీకీ వచ్చాడా..? తెలియకుండా వచ్చాడా..? అని చర్చించుకుంటున్నారు. ఎందుకంటే.. జగన్ ను కనుక పర్మిషన్ అడిగితే.. జగన్ పర్మిషన్ ఇచ్చే అవకాశమే లేదు. దీనికి కారణం.. ఏ సమావేశాలకు హాజరుకాబోమని చెప్పి మళ్లీ ఇలా చేస్తే ప్రజల్లో చులకన అయ్యే అవకాశం ఉంటుంది కనుక జగన్ ఖచ్చితంగా ఒప్పుకునే అవకాశమే లేదు. అంటే ఆయన వైసీపీ అధినేత మాట ధిక్కరించే ఈ సమావేశాల‌కు హాజరయ్యారనే అనుమానం తలెత్తుతుంది. ఇంకో ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే... ర‌ఘుప‌తి సైకిల్ ఎక్కుతారంటూ కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు రఘుపతి ఇలా చేయడంతో ఇది నిజమేనేమో అని అనుకుంటున్నారు. మరి చూద్దాం ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో. రఘుపతిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా వేసీపీ నేతలు అసెంబ్లీకి వస్తారా..? లేక అసెంబ్లీకి వచ్చినందుకు ఆయనపై యాక్షన్ తీసుకుంటారా..? చూద్దాం ఏం జరుగుతుందో..

google-ad-img
    Related Sigment News
    • Loading...