ప్రభుత్వాన్ని శాసనసభలో నిలదీస్తాము: జగన్
posted on: Aug 14, 2014 3:56PM
.jpg)
ఇటీవల హత్యకు గురయిన గొట్టిముక్కల గ్రామ ఉపసర్పంచ్ కృష్ణమూర్తి కుటుంబ సభ్యులను పరామార్శించిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో రాజకీయ ఘర్షణలు, తమ పార్టీ సభ్యులపై తెదేపా దాడులు పెరిగిపోయాయని, చివరికి పోలీసులు కూడా అధికార పార్టీ నేతలకు ఒత్తిడి వల్ల తమ పార్టీ కార్యకర్తలపి దాడులు జరుగుతున్నా చోద్యం చూస్తున్నారని, కనీసం తమ పిర్యాదులను కూడా వారు స్వీకరించడంలేదని ఆరోపించారు త్వరలో మొదలవనున్న అసెంబ్లీ సమావేశాలలో ఈ అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన తెలిపారు.
రెండు చేతులు కలిసినప్పుడే చప్పట్లు మొగినట్లు రాజకీయ ఘర్షణలు కూడా రెండు వర్గాలు కలహించుకొన్నపుడే మొదలవుతాయి. రాజకీయ ఘర్షణలలో సాధారణంగా కార్యకర్తలే బలవుతుంటారు తప్ప నేతలు కారు. ఎందువలన అంటే సదరు పార్టీల నేతలు ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీ సిబ్బంది పహారాలో కులాసాగా జీవిస్తుంటారు.ఇటువంటి దురదృష్ట ఘటనలు జరిగినప్పుడు సదరు నేతలు వచ్చి దానిని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నించడం మంచి పద్ధతి కాదు. కార్యకర్తలు ఏ పార్టీకి చెందినప్పటికీ వారు మనుషులే, వారికీ వారిపై ఆధారపడిన కుటుంబాలు కష్టనష్టాలు ఉంటాయి. కనుక రాజకీయ పార్టీల నేతలు వారి సంక్షేమం కోసం తామేమి చేసామో, ఏమి చేయగలమని ఆలోచించి తదనుగుణంగా వ్యవహరిస్తే బాగుంటుంది. అదేవిధంగా పోలీసులు కూడా రాజకీయాలకు, ఒత్తిళ్లకు అతీతంగా పనిచేయగలిగినప్పుడే వారిపై ప్రజలలో నమ్మకం, గౌరవం ఏర్పడుతుంది.



.jpg)
.jpg)

.webp)



