నిజం తెలుసుకుని మాట్లాడండి జగన్ సారూ.. జబర్దస్త్ కమేడియన్ మస్త్ కౌంటర్

posted on: Jan 30, 2026 2:21PM

 

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై జబర్దస్త్ కమేడియన్ శాంతి స్వరూప్ విమర్శలు గుప్పించారు. జగన్ వాస్తవాలు తెలియకుండా మాట్లాడి తనలాంటి ఆర్టిస్టులను అవమానించారని శాంతి స్వరూప్ పేర్కొన్నారు. ఇంతకీ విషయమేంటంటే జగన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల పేరుతో  ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం డికార్డింగ్ డ్యాన్సులను ప్రోత్సహించిందని విమర్శించారు.

ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం మంత్రి వాసంశెట్టి సుభాష్ టార్గెట్ చేసుకుని జగన్ విమర్శలు గుప్పించారు. మంత్రి హోదాను కూడా మరిచిపోయి వాసంశెట్టి సుభాష్ స్టేజిపై అసభ్యంగా డ్యాన్స్ చేశారన్నారు. జగన్ విమర్శలకు జబర్దస్త్ షోలో లేడీ గెటప్ రోల్స్ తో బాగా పాపులర్ అయిన శాంతి స్వరూప్ స్పందించారు. ఆ రోజు స్టేజిపై తాను కూడా ఉన్నానని పేర్కొంటూ.. నాటి కార్యక్రమానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మంత్రి వాసంశెట్టి సుభాష్ కు మద్దతు పలికారు.  

సంక్రాంతి సందర్భంగా ప్రదర్శనకు ఆహ్వానించడం ద్వారా ఆర్టిస్టులకు మంత్రి వాసంశెట్టి సుభాష్ పని కల్పించారనీ, దీంతో  ఆయనపై గౌరవంతో ఆర్టిస్టులే మంత్రిని స్టేజిపైకి ఆహ్వానించి తమతో డ్యాన్స్ చేయాల్సిందిగా కోరారని శాంతి స్వరూప్ వివరించారు. తాను కూడా మంత్రితో కలిసి డ్యాన్స్ చేశాననీ పేర్కొన్న శాంతి స్వరూప్ జగన్ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడారని విమర్శించారు. ఏదైనా మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని జగన్ కు హితవు పలికారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...