Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హనుమంత వాహనంపై సీతారామలక్ష్మణుల విహారం
posted on: Mar 31, 2026 10:11AM
.webp)
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం (మార్చి 30) రాత్రి విశేషమైన హనుమంత వాహన సేవ అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై తన ప్రియ భక్తుడైన హనుమంతుని వాహనాన్ని అధిరోహించి పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ, మంగళ వాయిద్యాల నడుమ వాహనసేవ నేత్రపర్వంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.
త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడిగా ప్రసిద్ధిగాంచిన హనుమంతుడు దాసభక్తికి ప్రతీకగా నిలిచారు. రాముడు హనుమంతునికి ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం చెబుతోంది. భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదించే హనుమంతుని సేవాభావాన్ని స్మరించుకుంటూ స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగారు. ఈ వాహన సేవలో డెప్యూటీ ఈఓ ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


.webp)



