Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఐటీ రిటర్న్స్ వేశారా? అయితే, యాక్సిడెంటైనా నో ప్రాబ్లమ్..!
posted on: Jun 29, 2017 11:06AM

ప్రతీ సంవత్సరం అందరూ ఐటీ రిటర్న్స్ బుద్దిగా సబ్ మిట్ చేస్తే ఏంటి లాభం? ఏముంది… దేశం బాగుపడుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగి జనానికి మంచి చేసే కార్యక్రమాలు గవర్నమెంట్స్ చేపడతాయి. ఇలా అనుకుంటే పొరపాటే! ఈ మధ్య ఓ ఫేక్ వాట్సప్ మెసేజ్ ఐటీ రిటర్న్స్ కి కొత్త లాభం ఆపాదించింది! అదేంటంటే, వరుసగా లాస్ట్ త్రీ ఇయర్స్ ఐటీ రిటర్న్స్ ఎవరైతే చక్కగా దాఖలు చేస్తారో… వారికి దురదృష్టవశాత్తూ యాక్సిడెంట్ అయితే ప్రభుత్వం పది రెట్లు నష్టపరిహారం అందజేస్తుందట! ఇదేంటి నాకు తెలియదే అంటారా? ఎవరికీ తెలిసే ఛాన్స్ లేదు! ఎందుకంటే, అదంతా ఫేక్ కాబట్టి!
వాట్సప్ లో చక్కర్లు కొడుతోన్న ఓ సమాచారం ప్రకారం… ఎవరైనా వరుసగా మూడు సంవత్సరాలు ఐటీ రిటర్న్స్ వేస్తే … వారికి యాక్సిడెంట్ అయిన సందర్భంలో గవర్నమెంట్ ఆ వ్యక్తి ఆదాయానికి సగటు లెక్కగట్టి నష్టపరిహారం ఇవ్వాలట! అదీ ఏకంగా పది రెట్లు! దీన్ని నమ్మించటానికి ఆ పోస్ట్ లో 1988 మోటర్ వెహికల్స్ యాక్ట్ ను కూడా పేర్కొన్నారు. సుప్రీమ్ కోర్టు జడ్జిమెంట్ కూడా వుందంటూ చెప్పారు. కాని, అసలు విషయం అది కానేకాదు.
వాట్సప్ పోస్ట్ లో చెప్పినట్టు మోటర్ వెహికల్స్ యాక్ట్ లో ఎక్కడా యాక్సిడెంట్ అయిన వారికి ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారం గురించి వుండదు. యాక్సిడెంట్లప్పుడు ఎవరైనా యాక్సిడెంట్ చేస్తారో వారే నష్టపరిహారం చెల్లించాల్సి వుంటుంది. ఇక సుప్రీమ్ కోర్టు కూడా గతంలో ఎప్పుడూ యాక్సిడెంట్ అయిన వారికి, ఐటీ రిటర్న్స్ క్రమం తప్పకుండా ఫైల్ చేసిన వారికి… ఎంత నష్ట పరిహారం ఇవ్వాలని ఎప్పుడూ చెప్పలేదు! కాని, ఎలాంటి సెన్సు , సెన్సారు లేని సోషల్ మీడియా మెసేజెస్ నిజానిజాలతో సంబంధం లేకుండా చక్కర్లు కొట్టేస్తుంటాయి! ఇదీ అంతే!






