హైదరాబాద్ లో ఐటీ సోదాల కలకలం
posted on Nov 18, 2025 8:39AM
.webp)
హైదరాబాద్ నగరంలో ఆదాయపు పన్ను శాఖ విస్తృత సోదాలు కలకలం రేపుతున్నాయి. మంగళవారం (నవంబర్ 18) తెల్లవారు జాము నుంచి ఐటీ అధికారులు నగరంలోని ప్రముఖ హోటల్ వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహిస్తున్నాయి. మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ ఐటీ సోదాలు సాగుతున్నాయి. పాతబస్తీలోని పిస్తా హౌస్, షా గౌస్ హోటల్స్ పై ఐటీ దృష్టి సారించింది.
ఏటా వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఈ హోటల్స్ ఆదాయంపై అసమానతలు ఉన్నాయన్న ఆరోపణలు రావడంతో ఈరెండు హోటల్‌లకు చెందిన చైర్మన్లు, డైరెక్టర్లు, ముఖ్య భాగస్వాముల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హోటల్ రంగంలో భారీ స్థాయిలో జరుగుతున్న లావాదేవీలపై అనుమానాలు వ్యక్తమవడంతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
నగరవ్యాప్తంగా జరుగు తున్న ఈ సోదాల్లో అధికారులు బ్యాంక్ ఖాతాలు, లావాదేవీల రికార్డులు, డిజిటల్ డేటా, అకౌంటింగ్ వివరాలు, డాక్యుమెంట్లు వంటి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు సమాచారం.