ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ దాడి

posted on: Mar 3, 2026 4:09PM

 

మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇజ్రాయెల్ దళాలు నేరుగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని అధ్యక్ష భవనంపై దాడి జరిపినట్లు సమాచారం. అధ్యక్ష భవనం పరిసరాలతో పాటు ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యాలయం, కీలక మిలిటరీ శిక్షణ కేంద్రాలపై కూడా క్షిపణి దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ మెరుపు దాడులతో టెహ్రాన్ నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

కచ్చితమైన నిఘా సమాచారం ఆధారంగానే ప్రభుత్వ లీడర్‌షిప్ కాంపౌండ్, మిలిటరీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లపై దాడులు చేపట్టామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఒక ప్రకటనలో పేర్కొంది. లక్ష్యిత ప్రాంతాల్లో ఉగ్ర మౌలిక వసతులు, వ్యూహాత్మక సైనిక కేంద్రాలు ఉన్నాయని తెలిపింది.

ఈ దాడులపై ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తమ సార్వభౌమాధికారంపై దాడిగా అభివర్ణిస్తూ ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించింది. అంతర్జాతీయ వేదికలపై కూడా ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...