Latest News
శాంతియత్నాలకు ఇజ్రాయెల్ మోకాలడ్డు
posted on: Mar 25, 2026 12:49PM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా చేస్తున్న శాంతి ప్రయత్నాలకు ఇజ్రాయెల్ మోకాలడ్డింది. ఇరాన్‌తో అమెరికా జరుపుతున్న శాంతి చర్చలతో తమకు సంబంధం లేదని కుండబద్దలు కొట్టింది.
ఇరాన్ పై తమ సైనిక దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇరాన్, దాని అనుబంధ సంస్థలతో ఇజ్రాయెల్ భద్రతకు ముప్పుపొంచి ఉందని పేర్కొన్న ఇజ్రాయెల్.. ఆ పరిస్థితి ఉన్నంత కాలం ఇరాన్ తో తమ వైరం కొనసాగుతుందనీ, వైమానిక దాడులను నిలిపే ప్రశక్తే లేదనీ పేర్కొంది. ట్రంప్ శాంతి ప్రతిపాదన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
అమెరికా చర్చలు జరుపుతున్నప్పటికీ తాము మాత్రం స్వతంత్రంగా సైనిక చర్యలు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రకటించిన నేపథ్యంలో పశ్చిమాసియాలో ఇప్పటిలో ఉద్రిక్తతలు చల్లారే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. అదే సమయంలో ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్, అమెరికా మధ్య విభేదాలు తలెత్తాయా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.






