Latest News

యూఎస్ సైన్యం ఉండే హోటళ్లు పేల్చేస్తాం...ఇరాన్ హెచ్చరిక

posted on: Mar 27, 2026 9:16PM

 

పశ్చిమాసియాలోని పలు అమెరికన్ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేయడంతో అవన్నీ నిర్మానుష్యంగా మారాయి. అందులోని అమెరికాసైనికులు గల్ఫ్‌లోని హోటళ్లలో ఆశ్రయం పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే యూఎస్ సైనికులకుఆశ్రయం కల్పిస్తే హోటళను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ముఖ్యంగా బహ్రెయిన్, యూఏఈలోని హోటళ్ల యజమానులకు ఈ హెచ్చరికలు జారీచేసినట్టు తెలుస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా చర్చల పేరుతో కాస్త విరామమిచ్చినట్లు ప్రకటించింది. 

అయితే.. ఇజ్రాయెల్ మాత్రం టెహ్రాన్ చమురు కేంద్రాలు, బాలిస్టిక్ మిసైల్స్ స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా ప్రతీకార దాడులతో విరుచుకుపడుతూ దీటుగా జవాబిస్తోంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీచేసింది ఇరాన్. తమ దేశంపై దాడులు చేస్తున్న వారికి గల్ఫ్‌ దేశాల్లోని హోటళ్లలో ఆశ్రయమివ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ రకమైన చర్యలను వెంటనే నిలిపివేయాలని.. అలాగే కొనసాగిస్తే మరోసారి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.  స్థావరాలను విడిచిపెట్టిన చాలామంది అమెరికా సైనికులు ఐరోపాలోని పలు హోటళ్లు, కార్యాలయాలకు తరలివెళ్లారని, అక్కడి నుంచే యుద్ధంలో పాల్గొంటున్నారని తమకు సమాచారం ఉందని ఇరాన్ అంటోంది. 

తాము ఆ హోటళ్లు, కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాల్సి ఉంటుందని, అమెరికా సైనికులకు గల్ఫ్‌ దేశాల్లోని హోటళ్లలో ఆతిథ్యం ఇస్తే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇరాన్‌ స్పష్టం చేసింది. ఇప్పటికే అమెరికా నేవీ బేస్‌లను పలు గల్ఫ్‌ దేశాల్లో ఏర్పాటు చేసుకున్నందుకు ఆ దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. దీంతో అమెరికా సైనికులు.. ఆ ప్రదేశాలను ఖాళీ చేయడంతో సుమారు 13 అమెరికన్ స్థావరాలు నిరుపయోగంగా మారాయి. ఆ క్రమంలో గల్ఫ్ దేశాల హోటళ్లు అమెరికా సిబ్బందిని అనుమతించవద్దని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...