అన్నిదేశాలు మీదపడినా..ఐఎస్ ఆదాయం తగ్గడం లేదు

posted on: Jun 11, 2016 2:41PM

.

ఉగ్రవాదానికి సరికొత్త భాష్యం చెబుతూ..మారణకాండతో ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది ఇస్లామిక్ స్టేట్. మిగిలిన ఉగ్రవాద సంస్థలకు ఐఎస్‌కు ఉన్న తేడా ఒక్కటే. అపార ఆదాయ వనరుల ద్వారా ప్రపంచంలోనే ధనిక తీవ్రవాద సంస్థగా ఐఎస్ పేరుగాంచింది. తద్వారా ఉగ్రవాదులకు వేతనాలు చెల్లించి కొత్త ట్రెండ్ సెట్ చేసింది. అందువల్లే అనేక మంది యువత ఇస్లామిక్ టెర్రరిజం వైపు ఆకర్షితులవుతున్నారు. మానవళి మనుగడకే ప్రమాదంగా మారిన ఐఎస్‌ను అణచివేయాల్సిన అవసరాన్ని గుర్తించిన అగ్రరాజ్యాలు ఉమ్మడిగా యుద్ధం ప్రకటించాయి. ఎంతగా ధ్వంసం చేసిననప్పటికి ఐఎస్ రాబడి ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికా ట్రెజరీ శాఖ మంత్రి డానియెల్ గ్లేసర్  హౌస్‌ ఆఫ్ రిప్రజెంటివ్స్ కమిటీకి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంతో ఈ విషయం ప్రపంచానికి వెల్లడైంది.

 

దీని ప్రకారం 2015లో ఐఎస్ రూ.6681 కోట్ల ఆదాయం సంపాదించిందని ఆయన తెలిపారు. ఇందులో సగం తమ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ విక్రయం ద్వారా సముపార్జించిందని తెలిపారు. స్ధానికుల నుంచి బలవంతపు వసూళ్ల ద్వారా రూ.350 మిలియన్ డాలర్ల ఆదాయం లభించిందన్నారు. 2014, 2015 ప్రారంభంలో ఇరాక్‌లోని తన అధీనంలోని ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి గణనీయ స్థాయిలో సుమారు రూ.3340.5 కోట్ల నిధులు పొందిందన్నారు. 2014లో కిడ్నాప్‌ల ద్వారా 20 నుంచి 45 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూర్చుకున్న ఐఎస్..ఆ ప్రాంతంలో విదేశీయుల సంఖ్య తగ్గిపోవడంతో బాగా నష్టపోయిందని చెప్పారు.

 

ఇస్లామిక్ స్టేట్ చమురు, సహజవాయువు సరఫరా వ్యవస్థను దెబ్బతీసే లక్ష్యంతో సంకీర్ణ దళాలు జరిపిన దాడులు జరిపాయని..ఉగ్రవాద సంస్థ దాచి ఉంచిన నగదు నిల్వలపైన జరిపిన దాడుల ద్వారా రూ.688 కోట్లు ధ్వంసమయ్యిందన్నారు. అటు ఐఎస్ ఆధీనంలోని ప్రాంతాలకు ప్రభుత్వ వేతనాలు పంపిణీ చేయకుండా ఇరాక్ ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో ఇస్లామిక్ స్టేట్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆర్థిక సంక్షోభం కారణంగా తన వద్ద పనిచేస్తున్న ఉగ్రవాదులకు ఐఎస్ వేతనాలు చెల్లించలేకపోతుండటంతో పలువురు ఆ సంస్థను వదిలిపెడుతున్నారని తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...