Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అగ్రరాజ్యం అధీనంలో ఇస్లామాబాద్.. ఏం జరుగుతోంది?
posted on: Apr 10, 2026 11:04AM
.webp)
అగ్రరాజ్యం అమెరికా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ ను పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించి.. ఇరాన్, అమెరికాల మధ్య శాంతి నెలకొల్పే చర్చలకు పాక్ రాజధాని ఇస్లామాబాద్ వేదిక కానున్న నేపథ్యంలో అమెరికా రంగంలోకి దిగింది. ఈ చర్చలకు వేదిక అయిన ఇస్లామాబాద్ లో అమెరికా అసాధారణ భద్రతా ఏర్పాట్లకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలోనే అమెరికా అడ్వాన్స్ డ్ సెక్యూరిటీ టీమ్ అమెరికాకు చేరుకుంది.
శాంతి చర్చల కోసం ఇప్పటికే ఇరాన్ ప్రతినిథుల బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. శాంతి చర్చలు శనివారం (ఏప్రిల్ 11) నుంచి మొదలు కానున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు సమసిపోయేందుకు ఈ చర్చలు అత్యంత కీలకమని భావిస్తున్న నేపథ్యంలో ఇస్లామాబాద్ లో భద్రతా ఏర్పాట్ల వ్యవహారం అంతా అమెరికా చూస్తున్నది. ఇస్లామాబాద్ చేరుకోనున్న అమెరికా ప్రతినిథుల బృందం రక్షణకు సంబంధించి అమెరికా పూర్తి బాధ్యత తీసుకుంది. ఈ చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా పలువురు కీలక నేతలు ఇస్లామాబాద్ చేరుకోనున్నారు. ఇక ఇరాన్ నుంచి ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ బాగెర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి నేతృత్వంలోని బృందం ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకుంది.
శాంతి స్థాపన దిశగా పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో జరుగుతున్న ఈ చర్చలు అత్యంత కీలకమైన నేపథ్యంలో భద్రతా బాధ్యతలను అమెరికాకు అప్పగించిన పాకిస్థాన్.. తమ పోలీసులు, సైనిక దళాలు అమెరికా సెక్యూరిటీ బృందానికి పూర్తి సహకారం అందిస్తారని పేర్కొంది.






