టీ20 వరల్డ్ కప్..టీమ్ ఇండియా ఓపెనర్ ఛాన్స్ కొట్టేసిన ఇషాన్ కిషన్
posted on: Feb 6, 2026 8:24AM

టీ20 వరల్డ్ కప్-2026లో భారత్ ఓపెనర్లలో ఒకడిగా అభిషేక్‌వశర్మ ఖరారైరయ్యాడు. అయితే రెండో ఓపెనర్ ఎవరన్నదానిపై అభిమానుల్లో ఇప్పటి వరకూ నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. రెండో ఓపెనర్ ఎవరనే ప్రశ్నకు సౌతాఫ్రికాతో బుధవారం (ఫిబ్రవరి 4) జరిగిన వార్మప్ మ్యాచ్‌తో సమాధానం దొరికేసింది. నవీ ముంబయి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఆ వార్మప్ మ్యాచ్ లో అభిషేక్ శర్మకు జోడీగా ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. సంజూ శాంసన్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన కిషన్ కేవలం 20 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఏడు సిక్స్‌లతో 53 పరుగులు సాధించాడు. ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌తో టీమిండియా ఓపెనర్‌గా తన బెర్త్ ను కన్ ఫర్మ్ చేసుకున్నాడు.
న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో పూర్తిగా విఫలమైన సంజూశాంసన్.. టి20 వరల్డ్ కప్ కు భారత జట్టులో తుది జట్టులో స్థానం దక్కించుకోవడంలో విఫలమయ్యాడు. ఇక ఇషాన్ కిషన్ విషయానికి వస్తే అతడు కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. . టీ20 ప్రపంచకప్ విషయంలో సెలెక్టర్ల దృష్టిలోనే లేడు. కానీ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో జార్ఖండ్ తరఫున అదిరిపోయే ప్రదర్శన చేయడంతో ఇషాంత్ కిషన్ కు . న్యూజిలాండ్ సిరీస్‌కు జట్టులో స్థానం లభించింది.
ఓపెనర్‌గా సంజూ విఫలమవుతుంటే.. వన్‌డౌన్‌లో వస్తూ ఇషాంత్ మెరుపు ఇన్నింగ్ లు ఆడాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 215 పరుగులతో సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. అదే సమయంలో సంజూ శాంసన్ అయిదు టీ20ల్లో కలిపి కేవలం 46 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో టి20 వరల్డ్ కప్ కు టీమ్ ఇండియా ఓపెనర్ గా స్థానం దక్కించుకున్నాడు.



.webp)


