రాహుల్ కోరుకుంటున్న జెన్ జెడ్ మూవ్ మెంట్ ఇదేనా?

మొన్నా మ‌ధ్య రాహుల్ ఓట్ చోరీ వ్య‌వ‌హారంలో చేసిన కామెంట్ ఏంటంటే.. భార‌త్ లోనూ విద్యార్ధులు జెన్ జెడ్ ఉద్య‌మం మొద‌లు పెడితే.. వారికి తాము అండ‌గా నిలుస్తామ‌ని అన్నారాయ‌న‌. అందులో భాగంగానే త‌న విదేశీ స‌ల‌హాదారు శ్యామ్ పిట్రోడా ద్వారా.. పాకిస్థాన్ సొంతింటిలా అనిపిస్తుంది.. నేపాల్, బంగ్లా ప్ర‌శాంతంగా ఉంటాయ‌న్న రాంగ్ కామెంట్స్ చేయించిన‌ట్టు గానూ తెలుస్తోంది.

ఇవ‌న్నీ అలాగుంటే ఇప్పుడు ల‌డక్ నుంచి రాహుల్ కొన్ని విదేశీ శ‌క్తుల‌తో క‌ల‌సి జెన్ జెడ్ మూమెంట్ ని మొద‌లు పెట్టిన‌ట్టుగా అంచ‌నా వేస్తున్నారు కొంద‌రు. కావాలంటే చూడండి.. ఇందులో కీల‌క పాత్ర పోషిస్తోంది పైకి సోనం వాంగ్ చుక్ అయినా.. దీని వెన‌క ఉన్న‌ది స్థానిక కాంగ్రెస్ నేత‌.. పుంట్సోక్ త్సెసాగ్ అంటారు వీరు. లేహ్ లోని ప్ర‌భుత్వ ఆస్తుల‌తో పాటు బీజేపీ కార్యాల‌యాన్ని త‌గ‌ల‌బెట్టించ‌డం అనే ఘ‌న కార్యం ఈ త్సెసాగ్ చేతుల మీదుగానే జ‌రిగింద‌ని చెప్పుకొస్తారు.

ఇంత‌కీ ఎవ‌రీ సోనం వాంగ్ చుక్. ఏంటీ ల‌డ‌క్ డిమాండ్? అని చూస్తే..  ఒక విద్యావేత్తగా, ఇంజినీర్‌గా, పర్యవరణ సంరక్షకునిగా, సామాజిక కార్యకర్తలు ఈ దేశ ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని సోనమ్ వమ్ము చేశాడ‌ని అంటారు బీజేపీ నేత‌లు. ఆచరణ సాధ్యం కాని డిమాండ్లతో లడ‌క్ ప్రజలను రెచ్చగొడుతున్నార‌నీ ఆరోపిస్తున్నారు వీరంతా.
 
లడ‌క్ ప్ర‌స్తుత‌ పరిస్థితిని మనమంతా గమనించాలనీ.. ఇప్పటికే లడక్‌లోని సగభాగం అక్సాయ్ చిన్‌ను చైనా ఆక్రమించిందనీ.. దేశ భద్రత దృష్ట్యా అది మన దేశానికే కీలక ప్రాంతమ‌నీ.. ఈ కారణాలవల్లే ఆర్టికల్ 370 రద్దు దర్వాత జమ్మూ కశ్మీర్ నుంచి లడ‌క్ ప్రాంతాన్ని విడదీసి కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించించారనీ చెప్పుకొస్తారు కాషాయ నేత‌లు.
 
కేవలం 2 లక్షల మంది కోసం ప్రత్యేక రాష్ట్రం ఎలా సాధ్యం?  ఈ లెక్కన మన దేశంలోని ప్రతి జిల్లాను ఒకటో, రెండో రాష్ట్రాలు చేయాల్సిందేనా? లడ‌క్‌ను ఆరో షెడ్యూల్ కింద చేర్చాలంటే దాన‌ర్ధ‌మేంటి? దీన్ని అడ్డం పెట్టుకొని అక్కడ పరిశ్రమలు, ఉపాధి కేంద్రాలు, ఏర్పాటు చేయకాకుండా అడ్డుకోవాల‌నే కుట్ర కాదా? అని ప్ర‌శ్నిస్తున్నారు క‌మ‌ల‌నాథులు. 

ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన మ‌రో ముఖ్య‌మైన విష‌య‌మేంటంటే.. వాంగ్‌చుక్‌కు పాకిస్తాన్ హ్యాండిల్స్  ఎందుకు మద్దతు ఇస్తున్నాయి? ఈయన వెనుక కొన్ని విదేశీ శక్తులు దాగి ఉన్నాయా? అన్న కోణంలోనూ ఆరా తీయాల్సిందేనంటారు బీజేపీ వారు.

ఈ అనుమానాల‌కు మ‌రింత ఊత‌మిచ్చేలా.. సోనమ్ వాంగ్‌చుక్ ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ లో పర్యటించి వచ్చారు. అంతే కాదు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్‌తో కూడా స‌త్సంబంధాలు ఉన్నాయి సోన‌మ్ కి. వాంగ్‌చుక్ చేస్తున్న డిమాండ్లను పరిశీలిస్తున్న కేంద్రం చర్చల కోసం తేదీలను కూడా ప్రకటించింది. అసలు సోనమ్ ఇచ్చిన జన్ జడ్ పిలుపు అర్థం హింసేనా? శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ తో పోల్చ‌డంలోని ఆంతర్యం ఏమిటి? ఇవన్నీ అంత‌ర్గ‌తంగా దేశ శాంతి భ‌ద్ర‌త‌ల‌ను అత‌లాకుత‌లం చేసే కుట్రలు కావా? అని ప్ర‌శ్నిస్తున్నాయి కాషాయ వ‌ర్గాలు.

రాహుల్ గాంధీ చెప్పిన జన్ జడ్ తిరుగుబాటు ఇదేనా? లడాక్‌లో అల్లరి మూకలను పోగేసి విధ్వంసానికి దిగింది ఎవరో గమనించ‌మంటున్నారు క‌మ‌ల‌నాథులు. స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ ఫుంట్సోగ్ స్టాన్జిన్ త్సెపాగ్ చేతిలో ఆయుద్ధం పట్టుకొని హింసాకాండకు నాయత్వం వహించాడ‌నీ.. లేహ్‌లో ప్రభుత్వ ఆస్తులతో పాటు బీజేపీ కార్యాలయానికి కూడా ఇత‌డే నిప్పు పెట్టించాడనీ అంటారు బీజేపీ లీడ‌ర్లు. అయితే ఫోటోల్లో ఉన్నది తాను కాదని త్సెపాగ్ బుకాయిస్తున్నాడనీ.. నిజమేంటో త్వ‌ర‌లో దర్యాప్తు ద్వారా తేలుతుందని చెప్పుకొస్తున్నారు బీజేపీ లీడ‌ర్లు. 

అసలు సోనమ్‌ వాంగ్‌చుక్‌కు కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధాలు ఏమిటి? ఈ విష‌యం కూడా త్వ‌ర‌లోనే బ‌య‌ట ప‌డుతుంద‌ని.. ఇదంతా రాహుల్ విదేశీ శ‌క్తుల‌తో చేతులు క‌లిపి చేస్తున్న కుట్ర మాత్ర‌మేన‌ని అంటోంది క‌మ‌ల‌ద‌ళం. మ‌రి చూడాలి.. ఈ పోరాటం ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్తుందో!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu