ఇది ఎయిర్ పోర్టేనా?

posted on: Jun 17, 2026 10:05AM

దేశంలోనే అత్యంత ఆధునికమైన, అలాగే  ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బెంగళూరులోని  కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2 ఇప్పుడు సోషల్ మీడియాలో  తెగ ట్రోలింగ్ కు గురౌతోంది.  ఇది నిజంగా అంతర్జాతీయ విమానాశ్రయమా? లేక రైల్వే స్టేషనా? అంటూ నెటిజనులు దుమ్మెత్తి పోస్తున్నారు. విమానాశ్రయంలోని అంతర్జాతీయ టెర్మినల్ లోపల ప్రయాణికులు  బెంచీలపై, నేలపై నిద్రిస్తున్న  షాకింగ్ దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.  ఈ  వీడియో   ఎయిర్‌పోర్ట్ లో   మౌలిక వసతుల కొరతపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  

అఫ్రీన్ అహెమది అనే ప్రముఖ డిజిటల్ క్రియేటర్ ఈ  వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో డిపార్చర్  ప్రాంతంలో ప్రయాణికులు అక్కడి సిమెంట్ బెంచీలపై, ఇండోర్ చెట్ల కింద, నేలపై తమ లగేజ్ బ్యాగులను దిండ్లుగా చేసుకుని గాఢనిద్రలో మునిగిపోయిన దృశ్యాలను కెమెరాలో బంధించారు.  ఈ దృశ్యాలు చూసిన నెటిజనులు అది అంతర్జాతీయ విమానాశ్రయమా? లేక రైల్వే స్టేషనా అని ప్రశ్నలు సంధిస్తున్నారు.  విమానాశ్రయంలో కనీస వసతుల కల్పనలో వైఫల్యాలకు ఇది నిలువుటద్దమని అంటున్నారు.  విమాన టిక్కెట్లకు వేలాది రూపాయలు, పన్నుల రూపంలో భారీగా వసూలు చేస్తున్నప్పుడు ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత లేదా అని నిలదీస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...