Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలిసి తెలిసీ తప్పుడు ఆరోపణలు.. వైసీపీ నైజం అదేనా?
posted on: Feb 18, 2026 12:58PM

జనం సొమ్ముతో మంత్రి జల్సాలు అంటూ కొలంబోలో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ వీక్షించడానికి వెళ్లిన మంత్రి లోకేష్ పై వైసీపీయులు చేసిన ప్రచారంపై లోకేష్ ఫ్లైట్ టికెట్టూ నాదే.. మ్యాచ్ టికెట్టూ నాదే... నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా.. జగన్ అంటూ తనదైన స్టైల్ లో స్పందించారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొలంబో మ్యాచ్ వీక్షించేందుకు మంత్రి లోకేశ్ ప్రభుత్వ ధనంతో వెళ్లారనే వార్తలో ఎలాంటి వాస్తవం స్పష్టత ఇచ్చింది.
వాస్తవానికి వైసీపీ ఆరోపణలు, విమర్శల స్థాయి రోజురోజుకూ పతనం నుంచి పతనానికి అన్నట్లుగా దిగజారుతోంది. జగన్ సొంత మీడియాలో లోకేష్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్లిన ప్రైవేట్ పర్యటనపై చేసిన ఆరోపణలు అవాస్తవంగా తేలడంతో ఆ పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారింది. టీమ్ ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన టి20 వరల్డ్ కప్ మ్యాచ్ చూడడానికి కొలంబో వెళ్లిన లోకేష్ అందుకైన ఖర్చు మొత్తం స్వయంగా భరించారు, రాష్ట్ర ఖజానా నుండి ఒక్క రూపాయి కూడా ఇందుకోసం వ్యయం చేయలేదు. అయితే వైసీపీ మాత్రం ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ విమర్శలు గుప్పించింది. అయితే ఫ్యాక్ట్ చెక్ లో వైసీపీ ప్రచారమంతా అవాస్తవమని విస్పష్టంగా తేలింది. రాష్ట్ర ఖజానా నుంచి లోకేష్ కొలంబో పర్యటనకు ఒక్క రూపాయి కూడా వినియోగించలేదని తేటతెల్లమైపోయింది. గతంలో కూడా తన సొంత పర్యటనల కోసం ప్రభుత్వం సొమ్ము వినియోగించడం లేదని పలు సందర్భాలలో లోకేష్ చెప్పారు. అయినా వైసీపీ విమర్శలు చేస్తూ ప్రతిష్ఠ దిగజార్చుకుంటోంది.
మసిగుడ్డ మీదేస్తాం.. మీరే తుడుచుకోండి అన్న చందంగా వైసీపీ తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో జగన్ అధికారంలో ఉండగా... ఆయన సతీసమేతంగా చేసిన విదేశీ పర్యటనలకు కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును వినియోగించిన సందర్భాలను పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. గతంలో అంటే జగన్ సీఎంగా ఉన్న సమయంలో తన పెద్ద కుమార్తె హర్ష ప్యారిస్ లోని అత్యంత ప్రతిష్టాత్మక ఇన్ సీడ్ బిజినెస్ స్కూల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంబీఎ) పూర్తి చేసిన సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పాల్గొనేందుకు జగన్ రెడ్డి సతీ సమేతంగా ప్యారిస్ వెళ్లారు. తన కుమార్తె పట్టా పుచ్చుకునే వేడుకను చూడాలనుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టలేదు. అయితే అందుకోసం ఆయన ప్యారిస్ వెళ్లడానికి జనం సొమ్ము ఖర్చు చేయడం అప్పట్లో తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతిని పరిశీలకులు చెబుతున్నారు.
అప్పటి ఆయన పారిస్ పర్యటన నాలుగు రోజులు సాగింది. ఇందు కోసం రానూ పోనూ విమాన ఖర్చులే రూ.10 కోట్లు అని అప్పట్లో గట్టిగా వినిపించింది. అప్పట్లో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉంది. ఉద్యోగులకు వేతనాలు సమయానికి చెల్లించే పరిస్థితి కూడా లేదు. అలాగే సంక్షేమ పథకాలకే ప్రభుత్వం కోత పెడుతున్న పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వ్యక్తిగత పర్యటనకు ప్రభుత్వ సొమ్ము రూ. 10 కోట్లు ఖర్చు చేయడాన్ని జగన్, ఆయనపార్టీ నేతలూ ఎలా సమర్థించుకోగలరని ప్రశ్నిస్తున్నారు. తన హయాంలో జనం సొమ్మును జగన్ పాకెట్ మనీగా వాడుకున్నారని తెలుగుదేశం శ్రేణులు విమర్శిస్తున్నాయి.



.webp)


