Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాక్రోచ్ జనతా పార్టీ.. కేవలం మీమ్ ఫ్యాక్టరీయా?.. రాజకీయ వ్యూహంలో భాగమా?
posted on: Jun 2, 2026 2:16PM

ఇటీవల సోషల్ మీడియాను ఊపేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వెనుక ఉన్న రహస్యం బయటపడింది. పైకి పొలిటికల్ సెటైర్ లా కనిపించే ఈ గ్రూపు వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ తో ముడిపడి ఉన్న ఒక సోషల్ మీడియా వ్యూహకర్త దాగి ఉన్నారని తెలుస్తోంది. ఈ కాక్రోచ్ జనతా పార్టీని సోమరులు, నిరుద్యోగులు, సోషల్ మీడియాలోనే కాలం గడిపేవారి పార్టీగా అభివర్ణిస్తూ.. వెబ్‌సైట్ కూడా రూపొందించారు.
ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కోర్టులో నిరుద్యోగ యువత, న్యాయవాదులు, జర్నలిస్టులు, సమాచార హక్కు కార్యకర్తలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో వ్యవస్థపై దాడి చేసే పరాన్నజీవులు ఇప్పటికీ ఉన్నారనీ.. కొంతమంది యువత కాక్రోచ్ లాంటి వాళ్లనీ.. వారికి ఉద్యోగం లేదా ప్రొఫెషన్‌లో సరైన గుర్తింపు దక్కనప్పుడు.. వారిలో కొందరు మీడియా, మరి కొందరు సోషల్ మీడియా, ఇంకొందరు-ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారిపోయి.. అందరినీ టార్గెట్ చేయడం మొదలుపెడతారనీ అన్నారాయన. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో, తాను నిజమైన నిపుణుల గురించి కాకుండా.. నకిలీ డిగ్రీలతో చలామణి అవుతున్న వారి గురించి మాట్లాడానని సీజేఐ సూర్యకాంత్ వివరణ ఇచ్చారు.
ఈ వివాదం నడుస్తుండగానే.. సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ.. వెబ్‌సైట్‌తో సహా ప్రత్యక్షమైంది. దీన్ని అభిజీత్ దిప్కే అనే వ్యక్తి ప్రారంభించారు. ఈయన గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా విభాగంలో కీలక సభ్యుడిగా, టీమ్ లీడర్‌గా పనిచేసినట్లు ఆయన లింక్డిన్ ప్రొఫైల్‌లో ఉంది. ఆ తర్వాత అతడీ ప్రొఫైల్లోని సమాచారాన్ని ఉద్దేశ్యపూర్వకంగా డిలీట్ చేసినట్టు కనిపించింది.
దిప్కే తన పోస్ట్‌లో.. బొద్దింకలు మేల్కొన్నాయి! అంటూ ఇదొక యువత తిరుగుబాటు అంటూ.. ప్రకటనలు సైతం గుప్పించారు. దీంతో ఇదంతా ఆప్ వ్యూహమా లేక యాధృచ్చికమా? అన్న చర్చ మొదలైంది. కాక్రోచ్ జనతాపార్టీ తమ వెబ్‌సైట్‌లో మాత్రం తామది.. వ్యవస్థ మర్చిపోయిన ప్రజల పార్టీ అని, సోమరులు, నిరుద్యోగుల గొంతుక అంటూ అభివర్ణించుకుంది. ఈ ఆన్‌లైన్ ట్రెండ్‌పై ప్రతిపక్ష నాయకులు కూడా స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్.. ఎంపీ కీర్తి ఆజాద్ సరదాగా ప్రశ్నించగా, మహువా మోయిత్రా కూడా తాను ఇందులో చేరాలనుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. సంభాషణలు నవ్వులాటగా ఉన్నప్పటికీ.. వీటి వెనుక ఉన్న లక్ష్యాలు మాత్రం పూర్తిగా రాజకీయ పరమైనవని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. కాక్రోచ్ జనతాపార్టీ మేనిఫెస్టోని బట్టి చూస్తే ఇది న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘంపై దాడిగానూ కనిపిస్తుంది.
అసలెవరీ అభిజీత్ దిప్కే అంటే.. ఇతడు- కేవలం ఒక సాధారణ సోషల్ మీడియా యూజర్ కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారాలు, సోషల్ మీడియా వ్యూహాలతో ఇతనికి ప్రత్యక్ష సంబంధ బాంధవ్యాలున్నాయి. 2020 ఢిల్లీ ఎన్నికలు విషయం తీసుకుంటే.. ఆప్ తరఫున మీమ్స్, పారడీ వీడియోలతో కేజ్రీవాల్ ప్రమోషన్, బీజేపీ-కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పించింది దీప్కేనే. ఇక వార్ రూమ్ బాధ్యతలు తీసుకుని..ఆప్ జాతీయ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా వాట్సాప్, ఫేస్‌బుక్ వ్యూహాల పర్యవేక్షణ చేసింది ఇతడే. రైతుల ఆందోళనల విషయంలోనూ అంతే. ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారినప్పుడు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడు దీప్కే.
ఇక ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేయడంలోనూ దిట్టగా పేరు సాధించాడు. 2024 తర్వాత, బీజేపీ ప్రజాదరణ తగ్గినా గెలుస్తోందని, ఓట్ల తొలగింపే కారణమని ఆరోపణలు చేశాడితడు. పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాల వల్ల నష్టపోయిన నీట్, సీబీఎస్ఈ విద్యార్థులకు తాము మద్దతు ఇస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించింది. అయితే.. విద్యార్థుల ఆగ్రహాన్ని రాజకీయంగా వాడుకోవడం.. ప్రతిపక్షాల పాత వ్యూహమే అన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.
కాక్రోచ్ జనతా పార్టీ అనేది పైకి కేవలం ఒక మీమ్ పేజీలా కనిపించినప్పటికీ, దీని వెనుక పూర్తి రాజకీయ ప్రయోజనాలున్నట్టు స్పష్టంగానే తెలుస్తోంది. దీని వ్యవస్థాపకుడికి ఆప్ తో ఉన్న సంబంధాలు, మేనిఫెస్టోలోని బీజేపీ వ్యతిరేకాంశాలు.. నీట్ వివాదంపై కేజ్రీవాల్ తరహా విమర్శలు వంటివి చూస్తే అదే అనిపిస్తుంది. ఇది నిరుద్యోగ యువత నుంచి స్వచ్ఛందంగా తరలి వచ్చిన ఉద్యమం కానే కాదు. ఇది కేవలం ఆప్ సోషల్ మీడియా ప్రతినిధి చేసిన ఒక డిజిటల్ ప్రయోగం మాత్రమే అంటారు పలువురు సోషల్ మీడియా నిపుణులు.
భారత్ వ్యతిరేక శక్తులు, హిందూ ద్వేషులు, కమ్యూనిస్ట్, ముస్లిం జిహాదీ శక్తులు, సోరోస్ లైన్, ఇస్లామిక్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, దళిత సోదరులను అడ్డం పెట్టుకున్న క్రిస్టియన్ ముఠాలు.. ఇలా ప్రతి ఒక్కరూ భారత్ మీద విరుచుకు పడటానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. మనమే జాగ్రత్తగా ఉండాలనీ హెచ్చరిస్తారు వీరు.
కాక్రోచ్ జనతా పార్టీ ఈ పేజీ ఫాలోవర్స్‌లో 49 శాతం మంది ఇస్లామిక్, కాంగ్రెస్ సొంత దేశం పాకిస్తాన్ నుంచే ఉండటం.. అర్థం చేసుకోవడం ఏమంత కష్టం కాదనీ అంటారు వీరంతా. ఈ సమయంలో భారత రాజకీయాల్లో అందరికంటే ఎక్కువగా కడుపు మంటతో రగిలిపోతున్న పొలిటికల్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే.. అది కేజ్రీవాల్ మాత్రమే. కారణమేంటని చూస్తే.. మొదట ఢిల్లీపై ఉన్న సర్వాధికారాలను లాగేసుకున్నారు. ఆపై గుజరాత్‌లో బీజేపీని ఓడించి తీరుతానని శపథం చేశారు కేజ్రీవాల్. తీరా చూస్తే గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కేజ్రీవాల్ కి చెందిన ఏడుగురు ఎంపీలు బీజేపీలోకి వెళ్లిపోయారు.
షెల్ కంపెనీలు కేవలం అవినీతి, స్కామ్‌ల కోసమే కాగితాలపై ఎలా ఉంటాయో.. సేమ్ ఇదీ అలాగే. గ్రౌండ్ లెవెల్‌లో వాటికి ఎలాంటి ఆధారం ఉండదని కేజ్రీవాల్ సార్ మర్చిపోయారు. దీంతో ఈ కాక్రోచ్‌లు కేవలం సోషల్ మీడియా వరకే పరిమితం అయ్యాయన్న మాట వినిపిస్తోంది. ఒకవేళ ఈ పేపర్ పులులు.. నిజంగా పని చేస్తుంటే.. పీఎం ఇన్ వెయిటింగ్ ఒక మెలోడీ టాఫీ ట్రెండ్‌కే భయపడి విసిరికొట్టేవారు కాదనీ అంటారు. సోషల్ మీడియా గోడలపై వీరు.. రోజుకోసారి ప్రధానులు అయిపోతుంటారు.. కానీ గ్రౌండ్‌లోకి రాగానే అసలు సిసలైన నిజం ఏంటో బయటపడుతుందనీ చెప్పుకొస్తారు వీరి కార్యకలాపాలపై సునిశిత విశ్లేషణ చేస్తున్నవారు.
గుర్తుపెట్టుకోండి.. షెల్ కంపెనీలు ఎప్పటికీ నిలబడవు, వాటి వెనుక ఉన్న స్కామ్ ఏదో ఒక రోజు బయటపడక తప్పదు. భారతదేశానికి చెందిన జెన్ జీ వేరే దేశాల యువత లాంటి వాళ్లు కాదు. తిరగబడితే గట్టిగా కొడతారు. అందుకేనేమో.. వీళ్ల ఫాలోవర్లు తగ్గడం కూడా మొదలైపోయినట్టుంది చూస్తుంటే అన్న విశ్లేషణలు సైతం అందుతున్నాయ్.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.






