ఐఆర్సీటీసీ మరో బంపరాఫర్..
posted on: Aug 3, 2017 11:17AM
.jpg)
రైలు ప్రయాణికులకు ఐఆర్సీటీసీ మరో బంపరాఫర్ ముందుకు తీసుకొచ్చింది. రైల్లో కాస్త సౌకర్యంగా ప్రయాణించాలంటే ముందుగా రిజర్వేషన్ చేసుకోవాల్సిందే. లేకపోతే పడే పాట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నిసార్లు టికెట్ రిజర్వేషన్ చేసుకున్నా.. వెయిటింగ్ లిస్ట్ అంటూ సీటు దొరకుతుందో..లేదో కూడా చెప్పలేం. తత్కాల్ లోనైనా సీటు దొరుకుతుందా అంటే గ్యారెంటీ ఉండదు. ఈ నేపథ్యంలోనే ఐఆర్సీటీసీ ఓ ఆపర్ ను తీసుకొచ్చింది. ఇకపై టికెట్ ను ఆన్ లైన్ లో తక్షణం బుక్ చేసుకుని డబ్బును ఆ తరువాత చెల్లించే వెసులుబాటును దగ్గర చేసింది. ఇక ఆ డబ్బులు ఇంటి వద్దకు వచ్చే తమ ప్రతినిధికి చెల్లింవచ్చని ఐఆర్సీటీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఐఆర్సీటీసీ వెబ్ సైట్లో ఇప్పటివరకూ సాధారణ రిజర్వేషన్లకు ఈ సదుపాయం ఉండగా, ఇకపై తత్కాల్ కింద బుక్ చేసుకున్న టికెట్లకు కూడా వర్తిస్తుంది. ఈ సదుపాయం కావాలంటే 'ఐఆర్సీటీసీ డాట్ పే ఆన్ డెలివరీ డాట్ కో డాట్ ఇన్'లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ సమయంలో ఆధార్, పాన్ వివరాలు ఇవ్వాలి. టికెట్ బుకింగ్ వేళ, పే ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆపై టికెట్ ను కేటాయించే ఐఆర్సీటీసీ, 24 గంటలలోపు పేమెంట్ కోసం ఉద్యోగిని పంపుతుంది. అతను వచ్చే లోపు డెలివరీ క్యాన్సిల్ చేసుకుంటే, భారీ జరిమానాతో పాటు, ఐఆర్సీటీసీ ఖాతా పర్మినెంట్ గా తొలగిపోతుంది.






