అమెరికా సైనికుడిని చంపితే రూ.28లక్షలు.. ఇరాన్ ఫత్వా.!

posted on: Aug 17, 2026 9:33AM

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం, ఉద్రిక్తతలూ రోజురోజుకూ పెచ్చరిల్లి పీక్స్ కు చేరుకోవడమే కాకుండా, అనూహ్య పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఇరాన్ తాజాగా  ఇరాన్ లోకి   చొరబడే అమెరికా సైనికులను మట్టుబెట్టినా లేదా సజీవంగా బంధించి అప్పగించినా భారీ నగదు బహుమతి ఇస్తామంటూ పత్వా ప్రకటించింది. ఈ ఫత్వా సాక్షాత్తూ ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ  అఫీషియల్ గా ప్రకటించడం గమనార్హం.

ఒక్కో అమెరికా సైనికుడిపైనా  30 వేల డాలర్లు.. అంటే ఇండియ్ కరెన్సీలో  28 లక్షల రూపాయల ఫత్వా ప్రకటించారు.  అంతే కాదు.. అమెరికా సైనికుడిని మట్టుపెట్టిన మహాళలకు అయితే.. 60 వేల డాలర్లు.. అంటే దాదాపు 56 లక్షల రూపాయలు ఇస్తామని ఇరాన్ ఆర్మీ చీఫ్ ప్రకటించారు.  

ఇరాన్ ప్రభుత్వం ప్రకటించిన ఈ ఫత్వా ప్రకారం,  అమెరికా సైనికుడిపై దాడి చేయడానికి లేదా అతడిని అంతమొందించడానికి ఉపయోగించిన ఆయుధాన్ని ఇరాన్ ప్రభుత్వం ఆయుధ యజమాని నుంచి రెట్టింపు ధరకు కొనుగోలు చేస్తుంది. అలాగే సదరు వ్యక్తికి కొత్త అధునాతన ఆయుధాన్ని బహుమతిగా అందిస్తుంది.  సైనికుడిని చంపిన పాత ఆయుధాన్ని త్వరలోనే నిర్మించబోయే ఇరాన్ జాతీయ యుద్ధ మ్యూజియంలో ప్రత్యేక జ్ఞాపికగా భద్రపరుస్తుంది.  పశ్చిమాసియాలో అమెరికా తన సైనిక ప్రాబల్యం గురించి ప్రపంచానికి చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలనిఇరాన్ ఆర్మీ చీఫ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతే కాకుండా పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్, హర్మూజ్ జలసంధిలోకి అమెరికా నావికాదళాల ప్రవేశానికి అనుమతి లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు.  

Iran US Soldier Reward, Fatwa, AmirHatami #Iran Army Chief,   Middle East Tensions, Iran Reward 30000 Dollars, US Soldiers Killed 

google-ad-img
    Related Sigment News
    • Loading...