Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అయతొల్లా అల్ ఖమేనీ మృతి?
posted on: Mar 1, 2026 6:28AM

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన సైనిక దాడిలో ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అల్ ఖమేనీ మరణించారా? అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఔననే అంటున్నారు.
డొనాల్డ్ ట్రంప్ అయితే.. చరిత్రలోనే అత్యంత క్రూరమైన వ్యక్తుల్లో ఒకరైన ఖమేనీ మరణించారు. ఇది ఇరాన్ ప్రజలకే కాదు, అతని ముఠా చేతిలో ప్రాణాలు కోల్పోయిన అమెరికన్లకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల బాధితులకు దక్కిన న్యాయం అంటూ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్ లో పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌తో కలిసి చేసిన ఈ ఆపరేషన్‌లో ఖమేనీతో పాటు ఇతర అగ్రనేతలు కూడా హతమయ్యారని ట్రంప్ పేర్కొన్నారు.
ఇలా ఉండగా ఖమేనీ మృతి వార్తను ఇరాన్ ధృవీకరించలేదు. అలాగే ఇజ్రాయెల్ కూడా ఖమేనీ మరణించి ఉండొచ్చునని మాత్రమే పేర్కొంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అయితే ఖమేనీ క్షేమంగానే ఉన్నారని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలే పేర్కొన్నారు.ఇక ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి అయితే.. దేశ సమగ్రతను కాపాడుకోవడంపైనే ప్రస్తుతం అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు.
ఇలా ఉండగా, శనివారం(మార్చి 28) టెహ్రాన్‌లోని ఖమేనీ అధికారిక నివాసం, కార్యాలయాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఖమేనీ నివాసం దెబ్బతిన్నట్లు శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు దాడి సమయంలో ఖమేనీ అక్కడి బంకర్ లోనే ఉన్నారు.


.webp)
.webp)


