Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇరాన్ సేఫ్ కాదు.. ప్రవాసాంధ్రులూ వెనక్కు వచ్చేయండి!
posted on: Feb 24, 2026 8:31AM

ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ లో ఉండటం క్షేమం కాదని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇరాన్ పై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయన్న ఆయన అక్కడ నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెంటనే వెనక్కు తిరిగి రావాలి పిలుపునిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ పై అమెరికా ఏ క్షణమైనా దాడి చేయవచ్చన్న అంచనాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఇండియన్ సిటిజన్స్ కు అక్కడి భారత ఎంబసీ కూడా అడ్వైజరీ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌లో ఉంటున్న ఏపీ విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రవాసులు క్షేమంగా స్వస్థలాలకు చేరుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ ప్రకటనలో కోరారు. అక్కడ జరుగుతున్న నిరసనలకు, ప్రదర్శనలకు దూరంగా ఉండాలని, సాధ్యమైనంత త్వరగా అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల ద్వారా తిరిగి రావాలని కోరారు. సహాయం అవసరమైన సందర్భంలో , ఏపీఎన్‌ఆర్టీ ఏర్పాటు చేసిన 24/7 హెల్ప్‌లైన్ నంబరు 91 8500027678 ను సంప్రదించాలని పేర్కొన్నారు.


.webp)
.webp)


