Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హోర్ముజ్‌పై అమెరికా డెడ్‌లైన్‌కు ఇరాన్ కౌంటర్.. శత్రుదేశాలకు నో ఎంట్రీ
posted on: Mar 23, 2026 9:41AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్‌కు 48 గంటల డెడ్‌లైన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ డెడ్‌లైన్‌పై ఇరాన్ ఆదివారం (మార్చి 22) స్పందించింది. శత్రుదేశాలకు మాత్రమే హోర్ముజ్ జలసంధిని మూసి వేశామని స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా హోర్ముజ్ జలసంధిలో రాకపోకలు దెబ్బతినటంతో క్రూడ్ ఆయిల్ సంక్షోభం నెలకొన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్‌కు డెడ్‌లైన్ విధిస్తూ హెచ్చరికలు జారీ చేశారు.
అయితే ఈ డెడ్‌లైన్ ను ఇరాన్ ఖాతరు చేయలేదు. ఆ దేశ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ శత్రుదేశాలకు మాత్రమే హోర్ముజ్ జలసంధిని మూసి వేశామని, మిగిలిన దేశాలు హోర్ముజ్ మీదుగా వెళ్లాలంటే భద్రతపై ఇరాన్ అధికారులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా పునరుద్ధరించాలని, లేదంటే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను నేలమట్టం చేస్తామని ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అతిపెద్ద కేంద్రం నుంచే ఈ దాడులు మొదలవుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ది ట్రూత్ లో శనివారం (మార్చి 21) ఓ పోస్టు పెట్టారు.
కాగా హోర్ముజ్ ఐల్యాండ్‌లో శత్రువులకు సంబంధించిన ఎఫ్ 15 ఫైటర్ జెట్‌ను కూల్చేశామని ఇరాన్ తెలిపింది. ఆదివారం (మార్చి 22) టెహ్రాన్ టైమ్స్ ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఎక్స్ ఖాతాలో విడుదల చేసింది. 29 సెకన్ల ఆ వీడియోలో ఇరాన్ దళాలు హోర్ముజ్ ఐల్యాండ్‌పై ఎఫ్ 15 ఫైటర్ జెట్‌ను గుర్తించి పేల్చిసిన దృశ్యాలు ఉన్నాయి. అయితే, ఆ ఫైటర్ జెట్ అమెరికాకు చెందినదా లేక ఇజ్రాయెల్‌కు చెందినదా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.






