గల్ఫ్ దేశాలపై ఇరాన్ బాంబుల వర్షం.. పశ్చిమాసియాలో యుద్ధవాతావరణం

posted on: Feb 28, 2026 10:53PM

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్   పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దీంతొ గల్ఫ్ దేశాలు గజగజలాడుతున్నాయి.   దుబాయ్, రియాద్, అబుదాబీ, దోహా, మనామా నగరాలపై ఇరాన్ బాంబులు, క్షిపణులతో విరుచుకుపడింది.   యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్‌లోని దుబాయ్‌పై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. దీంతో ఆ దేశంలోని అన్ని విమానాశ్రయాలను మూసివేశారు.  ముఖ్యంగా దుబాయ్ అల్ ముక్తమ్ విమానాశ్రయం మూతపడింది.
 
ప్రస్తుతం పరిస్థితుల్లో   ఎయిర్‌పోర్ట్ ల నుంచి ప్రయాణాలు సురక్షితం కాదని, తదుపరి సమాచారం కోసం సంబంధిత విమానయాన సంస్థలను నేరుగా సంప్రదించాలని సూచించింది.  ఈ దాడుల కారణంగా అబుదాబిలో  ఆసియా పౌరుడు ఒకరు మరణించాడు.  ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్‌ కారణంగా  పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకుంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...