Latest News

10 లక్షల సైన్యం సిద్ధం చేస్తున్న ఇరాన్… పిల్లలకే ఆయుధాలు!

posted on: Mar 27, 2026 3:22PM

 

ఇరాన్‌పై భూతల దాడులకు అమెరికా సిద్దమవుతుందున్న ప్రచారంతో.. ఆ దాడులను తిప్పికొట్టడానికి ఇరాన్ సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇరాన్ 10 లక్షలకు పైగా సైన్యాన్ని సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఇరాన్ మీడియా సైనికాధికారులను ఉటంకిస్తూ ఆ విషయం వెల్లడించింది. ఒకవైపు చర్చలు కొనసాగుతున్నాయంటూనే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పశ్చిమాసియాలో తన సైనిక ప్రాబల్యాన్ని విస్తరించే పనిలో పడ్డారు. 

దాంతో బసిజ్ ఫోర్స్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్‌లతో సహా అనేక విభాగాలను తక్షణమే కదనరంగంలోకి దించే విధంగా దళాలను బలోపేతం చేస్తున్నట్లు ఇరాన్ సైనిక వర్గాలు తెలిపాయి.  ఇరాన్ గడ్డపై అమెరికా సైన్యం అడుగుపెడితే వారికి నరకం చూపించేందుు తమ యోధులు సిద్దంగా ఉన్నారని హెచ్చరించాయి. సైన్యంలో చేరతామని బసిజ్ ఫోర్స్, ఐఆర్‌జీసీలకు యువత నుంచి పెద్దఎత్తున అభ్యర్ధనలు వస్తున్నట్లు వెల్లడించాయి. 

యుద్దం ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపధ్యంలో యుద్దంలో పాల్గొనేందుకు అర్హత వయసును కూడా ఇరాన్ తగ్గించినట్లు తెలుస్తోంది. 12 ఏళ పిల్లలు సైతం యుద్దంలో పాల్గొనేలా నిర్ణయం తీసుకున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ ఆపరేషన్‌కు ‘ఫర్ ఇరాన్’అని పేరు పెట్టారు. మరోవైపు ఇజ్రాయెల్ సైనిక కొరతను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అవసరమైన దానికంటే 12 వేల మంది తగ్గినట్లు సైనికాధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు అక్కడి మీడియా పేర్కొంది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...