Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఒరాకిల్ పై ఇరాన్ దాడి?
posted on: Apr 3, 2026 9:25AM

దిగ్గజ ఐటీ కంపెనీలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా దుబాయ్‌లోని ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ కార్యాలయంపై ఇరాన్ దాడికి పాల్పడింది. అయితే ఈ దాడి వార్తలు పూర్తిగా అవాస్తవమంటూ యూఏఈ ఓ ప్రకటనలో పేర్కొంది.
దుబాయ్ ఇంటర్నెట్ సిటీలో ఉన్న ఒరాకిల్ భవనం లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడిందన్న వార్తలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ దాడిలో ఒరాకిల్ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైందన్న వార్తలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే యూఏఈ ప్రభుత్వ మీడియా కార్యాలయం ' ఎక్స్ వేదికగా విడుదల చేసిన ఒక ప్రకటనలో ఒరాకిల్ పై దాడి జ వార్తలు పూర్తిగా వాస్తవ విరుద్ధమని స్పష్టం చేసింది.
ప్రాంతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇలాంటి వదంతులు వ్యాపించాయనీ, వాటిని విశ్వసించవద్దనీ ఆ ప్రకటనలో పేర్కొంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాల్లోని వాణిజ్య, సాంకేతిక కేంద్రాలపై దాడులకు పాల్పడతామనీ, మరీ ముఖ్యంగా దిగ్గజ ఐటీ సంస్థలను లక్ష్యం చేసుకుంటామనీ ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో ఒరాకిల్ పై దాడి వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ఒరాకిల్ పై ఇరాన్ దాడి అవాస్తవమని యూఏఈ క్లారిటీ ఇవ్వడమే కాకుండా, ఒరాకిల్ లో కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతున్నాయని పేర్కొంది. అనధికారిక వార్తలను విశ్వసించవద్దని ప్రజలను కోరింది. దేశంలోని పౌరులు, విదేశీయులు, వాణిజ్య సంస్థల భద్రతకు అన్ని చర్యలూ తీసుకున్నామని యూఏఈ పేర్కొంది.






