Latest News

అమెరికా కీలక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి

posted on: Mar 21, 2026 9:10AM

ఇరాన్ తన సత్తా చాటింది. అమెరికా వ్యూహాత్మక స్థావరంపై క్షిపణులను ప్రయోగించి అగ్రరాజ్యాన్ని బెంబేలెత్తించింది. ఇరాన్ చేసిన ఈ దాడిలో ఇంత వరకూ పశ్చిమాసియాకే పరిమితమైన అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు హిందూ మహాసముద్రం వరకూ విస్తరించిననట్లైంది. విషయానికి వస్తే ఇరాన్ దాదాపు నాలుగువేల కిలోమీటర్ల దూరంలోని అమెరికా వ్యూహాత్మక సైనిక స్థావరనం డియాగో గార్సియా లక్ష్యంగా దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించింది.  

ఈ దాడితో ఇరాన్ ఆయుధ సంపత్తిని అంచనా వేయడంలో అమెరికా ఘోరాతి ఘోరంగా విఫలమైన సంగతి ప్రపంచానికి తేటతెల్లమైంది.  
కాగా ఇరాన్ అమెరికా డియాగో సైనిక స్థావరంపై రెండు క్షిపణులను ప్రయోగించగా, వాటిలో ఒకటి విఫలమైంది. రెండో క్షిపణిని అమెరికా నిర్వీర్యం చేసింది. ఇరాన్ దాడి వల్ల అమెరికాకు ప్రస్తుతానికి ఎటువంటి నష్టం జరగకపోయినప్పటికీ.. ఆ దేశానికి అత్యంత కీలకమైన యుద్థవిమానాలు, బాంబర్ల స్థావరంపై ఇరాన్ దాడికి పాల్పడటంతో అమెరికా రక్షణ వ్యూహాల డొల్లతనం ప్రపంచానికి తెలిసిపోయింది.  

అదే సమయంలో ఇరాన్   ప్రపంచంలో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దాడులకు పాల్పడే తన శక్తిని ఈ దాడి ద్వారా చాటింది.  అంతే కాకుండా ఇరాన్ కీలక సైనిక జనరల్ ఒక ప్రకటన చేస్తూ..  పర్యాటక కేంద్రాల లక్ష్యంగా దాడులు చేస్తామని హెచ్చరించారు.  ఇప్పటికే హర్మూజ్ జలసంధిలో రవాణా స్తంభించిపోవడంతో అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం తలెత్తన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రకటన ప్రపంచ దేశాలను ఆందోళనలో ముంచేసింది.  ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ప్రతినిధి అలీ మహమ్మద్ నైనీ   అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో మరణించిన రోజు వ్యవధిలోనే ఇరాన్ అమెరికా సైనిక స్థావరంపై దాడికి పాల్పడటం గమనార్హం.

google-ad-img
    Related Sigment News
    • Loading...