ఇరాన్–ఇజ్రాయెల్ సంక్షోభం..చిన్న విరామం పెద్ద ప్రమాద సంకేతం

posted on: Apr 18, 2026 2:10PM

ఇది శాంతి కాదు, ఒక విరామం మాత్రమే

ఇరాన్–ఇజ్రాయెల్ సంక్షోభం చుట్టూ ప్రస్తుతం కనిపిస్తున్న  పీస్ ట్రాక్ నిజానికి ఒక సున్నితమైన విరామం మాత్రమే. దీనిని మూడు ప్రధాన శక్తులు విభిన్న దిశల్లో లాగుతున్నాయి:
 అవి 
1. సైనిక ఒత్తిడి.. ఇజ్రాయెల్, ఇరాన్, హిజ్బుల్లా, అమెరికా  ఇంకా డిటరెన్స్ మోడ్లోనే ఉన్నాయి.
2.  అంతర్గత రాజకీయాలు..  ప్రతి దేశ నాయకత్వం తమ దేశ ప్రజల ముందు బలహీనంగా కనిపించకూడదు అనే ఒత్తిడిలో ఉంది.
3. గ్రేట్ పవర్ రైవల్రీ..  అమెరికా, ఇరాన్, రష్యా, చైనా  ఇలా ప్రతి ఒక్కరూ ఈ సంక్షోభాన్ని తమ వ్యూహాత్మక ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. 
ఈ మూడు లేయర్లు కలిసిపోవడంతో, శాంతి ప్రయత్నాలు స్థిరపడక ముందే కూలిపోవచ్చు అన్న హెచ్చరిక స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక యుద్ధం విషయానికి వస్తే..
 48వ రోజు పరిస్థితి: ఇజ్రాయెల్–లెబనాన్  కాల్పుల విరమణ చిన్న కిటికీ మాత్రమే.. పెద్ద పరిష్కారం కాదు. ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దులో తాత్కాలిక కాల్పుల విరమణ ఒక సన్నని రాజకీయ కిటికీ తెరిచింది. అయితే ఇది ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య ఉన్న మూల భద్రతా సమస్యలను పరిష్కరించలేదు.  హిజ్బుల్లా వద్ద ఉన్న రాకెట్, డ్రోన్ సామర్థ్యం, ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దు భద్రతపై ఉన్న ఆందోళనలు, లెబనాన్లో హిజ్బుల్లా యొక్క ప్రభావం ఇందుకు కారణం. అయితే ఈ కాల్పుల విరమణ వల్ల దౌత్యానికి కొంత సమయం లభించింది. కానీ సైనిక సమీకరణలు, ఆయుధ సామర్ధ్యాలు, ఉద్దేశాలు మాత్రం మారలేదు. అందువల్ల లఇది వ్యూహాత్మక వి
ఈ ceasefire వల్ల:
 - డిప్లమసీకి కొంత సమయం దొరికింది
 -కానీ సైనిక సమీకరణలు, ఆయుధ సామర్థ్యాలు, ఉద్దేశాలు మాత్రం మారలేదు
అందువల్ల ఇది  వ్యూహాత్మక విరామమే తప్ప..  వ్యూహాత్మక  పరిష్కారం కాదు.
    
ఇరాన్, ఇజ్రాయెల్ రెండూ కూడా ఓ వైపు బలప్రదర్శన చేస్తూ, మరో వైపు  పరిమితంగానైనా ఉద్రిక్తతల తగ్గింపునకు చూస్తున్నాయి. అదే సమయంలో తగ్గేదేలే అనే సందేశం కూడా ఇస్తున్నాయి. కానీ పూర్తి యుద్ధానికి ప్రిపేరై లేవు.  ఈ ద్వంద్వ ధోరణి వల్ల తప్పు అంచనాలు, తప్పు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం పెచ్చరిల్లుతోంది. 
  అమెరికా ఇరాన్  దౌత్యంలో చర్చల టేబుల్ మీదే యుద్ధ నీడ పడగలా ఉంది. పైగా ఇది పూర్తి ఒప్పందం కాదు, ఒక మధ్యంతర డీల్ మాత్రమే. ఇప్పుడు ఇరాన్ పాత అణు ఒప్పందం  లాంటి పూర్తి డీల్ కంటే,     సన్నని, మధ్యంతర, పరిమిత ఒప్పందం కోసం సిద్ధంగా ఉన్నానన్న  సంకేతాలు ఇస్తోంది.
అంటే దీనర్ధం..  కొన్ని అణు కార్యకలాపాలపై పరిమిత నియంత్రణ, అందుకు ప్రతిగా ఆంక్షల సడలింపు, కొంత శాతి యత్నం కోరుతోంది. అంటే ఇరాన్ ఆర్థికఊపిరి కోరుతోంది కానీ పూర్తిగా వెనక్కుతగ్గే పరిస్థితి లేదన్న సందేశాన్నివిస్పష్టంగా ఇస్తోంది. 
 
 అలాగే అమెరికా కూడా ఒక వైపు దౌత్యానికి తలుపు తెరిచి ఉంచుతూనే.. మిలిటరీయాక్షన్ ఆప్షన్ ఉందని బాహాటంగానే చెబుతోంది. అమెరికా ఈ వైఖరే  ఇరాన్ నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. అమెరికా నిజంగా శాంతి ఒప్పందం కోరుకుంటోందా?  లేక ఒత్తిడి పెంచే  వ్యూహంలో భాగంగానే చర్చలు అంటోందా అన్న అనుమానం వ్యక్తమౌతోంది.  దీంతో విశ్వాసలోటు మరింత ఎక్కువ అవుతోంది.  
 ఇక హోర్ముజ్ జలసంధి.. ఇది ఇరాన్ చేతిలో ఉన్న గ్లోబల్ చోక్ పాయింట్. హోర్ముజ్   ఇరాన్ కు ఒక వ్యూహాత్మక ఆయుధం.  ప్రపంచ చమురుకు అత్యంత కీలకం. ఈ మార్గం గుండా వాణిజ్య నౌకల రాకపోకలకు అవకాశం ఉంది.. కానీ అని షరతులు విధిస్తోంది. దీనిని ఒక లీవరేజ్ టూల్ గా ఉపయోగిస్తోంది.  దీంతో  అమెరికా, గల్ఫ్ దేశాలు, గ్లోబల్ మార్కెట్లపై ఇరాన్ వ్యూహాత్మక ఒత్తిడి పెంచుతోంది. 
 హోర్ముజ్లో ఏ చిన్న అంతరాయం ఏర్పడినా.. అది చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.  గ్లోబల్ ట్రేడ్, షిప్పింగ్ ఖర్చులు తడిసిమోపెడౌతాయి.  ఇక్కడే ఇరాన్.. మీరు మాపై ఒత్తిడి పెంచితే.. మేం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతామంటూ వ్యూహత్మక సందేశాన్ని అమెరికాకు ఇస్తున్నారు. 
ఇది ఇరాన్కు ఒక “మీరు మాపై ఒత్తిడి పెంచితే, మేము ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచగలం” అనే స్ట్రాటజిక్ సందేశం.
  విభిన్న అజెండాలు, మిక్స్డ్ మెసేజింగ్ ల మధ్య అందరూ శాంతి కంటే టైమ్ కొనుగోలుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 

- ఇరాన్:  ఆంక్షల ఒత్తిడిని తట్టుకుంటూ, ప్రాక్సీల ద్వారా ప్రెషర్ కొనసాగిస్తూ, మధ్యంతర డీల్ ఆప్షన్ తెరిచి ఉంచుతోంది.
- ఇజ్రాయెల్:  భద్రతా బెదిరింపులను తగ్గించాలనే లక్ష్యం, కానీ అంతర్గత రాజకీయ ఒత్తిడి వల్ల  మెతకగా కనిపించకూడదన్న అనివార్యత.
అమెరికా: పూర్తి యుద్ధం వద్దు, కానీ డిటరెన్స్ బలంగా ఉండాలి.  చైనా, రష్యా ప్రభావాన్ని కూడా కంట్రోల్ చేయాలి.
లెబనాన్, ఇతరులు: తమ భూభాగం యుద్ధరంగం కాకూడదనే భయం, కానీ హిజ్బుల్లాపై పూర్తి నియంత్రణ లేదు.
ఈ పరిస్థితిలో ఎవరూ పూర్తి శాంతి ఒప్పందానికి కమిట్ కావడం లేదు. అందరూ  , రెడ్ లైన్స్ టెస్ట్ చేస్తూ, టైమ్ కొనుగోలు చేస్తున్నారు.
- ఒకవైపు కాల్పుల విరమణ చర్చలు, మధ్యవర్తిత్వం, మరో వైపు  మేము మళ్లీ దాడి చేస్తాం..   రెడ్ లైన్ దాటితే తీవ్ర ప్రతిస్పందన అంటూ ప్రకటనలు.
ఈ మిక్స్డ్ మెసేజింగ్ వల్ల.. క్షేత్ర స్థాయిలో ఉన్న కమాండర్లు, మిలీషియా గ్రూపులు, ప్రాక్సీలు సంకేతాలను తప్పుగా అర్ధం చేసుకునే ప్రమాదం పొంచి ఉంది.  చిన్న సంఘటన కూడా పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంది. 
 చిన్న సంఘటన కూడా పెద్ద ఎస్కలేషన్కు దారి తీసే అవకాశం.  చిన్న కాలిక్యులేషన్ రిస్క్ ను చాలా ప్రమాదకర స్థాయికి తీసుకెళ్తోంది.
 మొత్తంమీద  ఈ విరామం తర్వాత పరిస్థితి మరింత ప్రమాదకర దశకు వెళ్లే  ప్రమాదం ఉంది. 
 అంటే ప్రస్తుతం నడుస్తున్న ఈ  పీస్ ట్రాక్ ఒక సున్నితమైన, తాత్కాలిక విరామం మాత్రమే. రాజకీయ గమ్యాల విషయంలో స్పష్టత లేకుండా, సంకేతాలలో స్థిరత్వం లేకుండా ఈ విరామం స్థిరమైన శాంతిగా మారడం అటుంచి,  కొత్తగా మరింత ప్రమాదకర దశకు మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.  అంటే, ఇప్పుడు కనిపిస్తున్న శాంతి ప్రయత్నాలు వ్యవస్థాగత ప్రమాదాన్ని పూర్తిగా తగ్గించడం లేదు. కేవలం ఎప్పుడు, ఎక్కడ, ఎలా పరిస్థితి ఎస్కలేట్ అవుతుందన్న టైమింగ్ ను మారుస్తున్నాయి. 

సంకలనం, సేకరణ : సీతారాం కంఠమనేని

google-ad-img
    Related Sigment News
    • Loading...