Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దాడులు ఆపి, హర్మూజ్‌ను తెరవండి...ఇరాన్‌ను కోరుతూ 22 దేశాల సంయుక్త ప్రకటన
posted on: Mar 22, 2026 11:43AM

హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్‌ను 22 దేశాలు కోరాయి. చమురు క్షేత్రాలు, వాణిజ్య నౌకలపై దాడులను ఖండిస్తూ, వాటిని ఆపేయాలని కోరాయి. ఇరాన్ చర్యల వల్ల అన్ని దేశాలపై దుష్ట్రభావం పడుతోందని పేర్కొన్నాయి. ఈ మేరకు యూఏఈ, యూకే, ప్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, డెన్మార్క్, బహ్రెయిన్ తదితర దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి.
గల్స్‌లోని నిరాయుధ వాణిజ్య నౌకలు, చములు, గ్యాస్, కేంద్రాలు సహా పౌర మౌలిక సదుపాయాలపై ఇటీవల ఇరాన్ జరిపిన దాడులు, హర్మూర్ జలసంధిని మూసివేతను ఖండిస్తున్నట్లు పేర్కొన్నాయి. సముద్ర చట్టాలకు సంబంధించి ఐక్య రాజ్య సమితి ఒప్పందంతో పాటు, స్వేచ్చాయుత నౌకాయానం అనేది అంతర్జాతీయ చట్టంలో ఒక ప్రాథమిక సూత్రమని గుర్తి చేశాయి. ఇరాన్ చర్యలు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలపై, ముఖ్యంగా అత్యంత బలహీన వర్గాలపై ప్రభావం పడుతోందని యూఏఈ విదేశాంగ శాఖ ఓ సంయుక్త ప్రకటన విడుదల చేసింది. అందులో 22 దేశాలు సంతకాలు చేశాయి.






