Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఐపీఎల్ 2019 షెడ్యూల్ విడుదల.. కానీ?
posted on: Feb 19, 2019 4:04PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 సీజన్ తొలి రెండు వారాల షెడ్యూలును బీసీసీఐ విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి రెండు వారాల షెడ్యూల్‌ని మాత్రమే విడుదల చేస్తున్నామని, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను అనుసరించి తదుపరి షెడ్యూల్‌ని త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. మార్చి 23 చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 వరకు విడుదల చేసిన ఈ షెడ్యూల్‌లో మొత్తం 17 మ్యాచ్‌లు జరుగుతాయి. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఐదు మ్యాచులు.. మిగితా ఆరు జట్లు నాలుగు మ్యాచులు ఆడనున్నాయి.







