పక్షం రోజుల్లోనే రూ.15 లక్షల డెత్ క్లెయిమ్

posted on: Feb 19, 2026 8:46AM

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్   డెత్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ విషయంలో సులభతర విధానాన్ని పరిచయం చేసింది. డెత్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం ఆన్‌లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాంక్ ఖాతాదారులు చనిపోయిన సందర్భాల్లో వారి కుటుంబ సభ్యులు లేదా వారసులు బ్యాంక్ చుట్టూ తిరగాల్సిన పని లేకుండానే డెత్ క్లెయిమ్‌ కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును అందుబాటులోకి తీసుకువచ్చింది. 15 లక్షల రూపాయల వరకు నగదు సెటిల్‌మెంట్‌కు ఎలాంటి థర్డ్ పార్టీ ష్యూరిటీ అవసరం లేదు.

కేవలం 15 రోజుల వ్యవధిలోనే క్లెయిమ్ సెటిల్‌మెంట్ పూర్తి అవ్వనుంది. డెత్ క్లెయిమ్ పొందాలంటే.. ఐఓబీ పోర్టల్‌లో డెత్ క్లెయిమ్ విభాగంలోకి వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. క్లెయిమ్ ఫారం, ఖాతాదారుడి డెత్ సర్టిఫికెట్, నామినీ గుర్తింపు పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఒక వేళ నామినీ లేని పక్షంలో ఇండెమ్నిటీ బాండ్, డిస్‌‌క్లెయిమర్ లెటర్, లీగల్ హెయిర్ సర్టిఫికెట్ సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. కాగా, డెత్ క్లెయిమ్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఏడాది కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. మరణించిన వారి బ్యాంకు ఖాతాలు, లాకర్లకు సంబంధించిన క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిబంధనలను సవరించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...