పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా
posted on: Feb 6, 2026 1:52PM

తెలంగాణ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణను సుప్రీంకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. ఎమ్మెల్యేల పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ జరుపుతున్నారని 3 వారాల సమయం కావాలని స్పీకర్ తరుపున న్యాయవాది అభిషేక్ సంఘ్వీ ధర్మాసనాన్ని కోరారు. 8 మంది ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకున్నామని, మరో ఇద్దరిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. మూడు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం ప్రకటించకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కారు గుర్తు నుంచి గెలిచి హస్తం పార్టీలోకి చేరినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే 8 మందికి సభాపతి క్లీన్‌చిట్ ఇచ్చారు. వారిలో అరెకపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టి.ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్ ఉన్నారు. సదరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా సరైన ఆధారాలు లేవని, వారు ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యులుగానే ఉన్నారని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు


.webp)
.webp)


