నిలిచిపోయిన ఎక్స్ సేవలు.. యూజర్లు గగ్గోలు

posted on: Mar 19, 2026 8:23AM

ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్ సేవలు బుధవారం (మార్చి 18) రాత్రి నిలిచిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్  మైక్రోబ్లాగింగ్ సైట్ సేవలు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో నెటిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారత్‌ సహా  పలు దేశాల్లో సాంకేతిక సమస్య కారణంగా ఎక్స్ పని చేయకపోవడంతో  యూజర్లు ఇబ్బందులు పడ్డారు.  

కొత్తగా వచ్చే పోస్టులు కనిపించకపోవడం,  ట్వీట్లు లోడ్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. మొబైల్ యాప్‌తో పాటు డెస్క్‌టాప్ వెర్షన్‌లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది.  డౌన్‌డిటెక్టర్ వంటి వెబ్‌సైట్ల గణాంకాల ప్రకారం ఎక్స్ పని చేయడం లేదంటూ లక్షల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి.  

గతంలోనూ ఎక్స్ లో ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ఈసారి అంతరాయం సుదీర్ఘంగా ఉందని యూజర్లు అంటున్నారు.   సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సమయంలో  ఇటువంటి సాంకేతిక ఇబ్బందులు సహజమేనని నిపుణులు చెబుతున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...