Latest News
ఏఈసీఎస్ లో టీచర్ పోస్టులకు ఇంటర్వ్యూలు
posted on: Mar 14, 2026 9:55AM

హైదరాబాద్‌లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ లో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), ప్రైమరీ టీచర్ (పీఆర్టీ), పీఆర్‌టీ తెలుగు, పీఆర్‌టీ మ్యూజిక్, బాలవాటిక టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ పోస్టులన్నిటినీ కాంట్రాక్ట్ ఆధారంగానే భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ నెల 23 నుంచి 25 వరకూ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఈ ఇంటర్వ్యూలు హైదరాబాద్‌లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ లో నిర్వహిస్తారు.
ఇంగ్లీష్, సోషల్ సైన్స్, హిందీ, సంస్కృతం, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ టీచర్ పోస్టులు, అలాగే కంప్యూటర్ సైన్స్ టీచర్ పోస్టులు, ప్రైమరీ టీచర్, తెలుగు, బాటవాటిక టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్ పేర్కొంది. కాగా ఈ పోస్టులకు సంబంధిత సబ్జెక్ట్ లో కనీసం 50 శాతం మార్కులతో బీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చును,
ఇక పీఆర్టీ టీచర్ పోస్టులకైతే ఇంటర్ లేదా సమాన విద్యార్హతతో 50 శాతం మార్కులు ఉండలి. అలాగే డీఈఐ, బీఈఐఎడ్ లేదా డిప్లమో ఇన్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి. టీజీటీ పీర్టీ టీచర్ పోస్టులకైతే వయోపరిమితి 35 సంవత్సరాలు, రిజర్వేషన్ ఉన్నట్లైతే వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.


.webp)
.webp)


