సాగర తీరంలో యుద్ధ నౌకల సందడి

posted on: Feb 18, 2026 11:30AM

విశాఖ సాగరతీరంలో  ప్రపంచ యుద్ధనౌకలు సందడి చేశాయి. బుధవారం (ఫిబ్రవరి 18)   జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ 2026లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో  గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రపతి  ఐఎన్ఎస్ సుమేధ  యుద్ధనౌకపై నుంచి సముద్రంలో బారులు తీరిన 70కి పైగా యుద్ధనౌకలు, జలాంతర్గాములను వీక్షించారు.  స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమెరికా, రష్యా, జపాన్ వంటి 50కి పైగా దేశాల  యుద్ధనౌకలు ఈ ప్లీట్ రివ్యూలో పాల్గొన్నాయి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...