Latest News

కామారెడ్డి హైడ్రామా సుఖాంతం

posted on: Mar 20, 2026 3:04PM

 

కామారెడ్డిజిల్లాలోని మహమ్మద్‌నగర్ మండలంలో ఉన్న బుర్గుల్ గ్రామంలో ఉదయం ప్రారంభమైన ఉద్రిక్త పరిస్థితి రాత్రి వరకు కొనసాగి, చివరకు సుఖాంతం కావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. 60 అడుగుల ఎత్తైన వాటర్ ట్యాంకుపైకి ఎక్కి ఆత్మ హత్య చేసుకుంటానని బెదిరించిన ఇంటర్మీడియట్ విద్యార్థిని శ్రావంతిని బాన్స్వాడ సబ్-కలెక్టర్ కిరణ్మయి సమయస్ఫూర్తితో కాపాడారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుర్గుల్ గ్రామానికి చెందిన శ్రావంతి ఇండల్వాయి గురుకులంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవలే పరీక్షలు ముగించు కుని ఇంటికి వచ్చిన ఆమె, ఎక్కువ సమయం మొబైల్ ఫోన్‌లో గడుపుతుండటంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి ఈ విషయంపై ఆమెను మందలించడంతో, ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. దీంతో ఉగాది పండగ రోజు గురువారం  ఉదయం సుమారు 11 గంటల సమయంలో శ్రావంతి ఇంటి సమీపంలోని నీటి ట్యాంకు మెట్లపైకి ఎక్కి, పైభాగానికి చేరుకుంది. 

అక్కడి నుంచి దూకుతానని బెదిరిస్తూ, ఎవరి మాటా వినకుండా కూర్చుంది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామ సర్పంచ్ వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఆమె వినిపించుకోలేదు. పరిస్థితి విషమంగా మారడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకున్న వెంటనే శ్రావంతి మరింత ఆందోళనకు గురై ట్యాంకు పైభాగానికి ఎక్కడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. సమయం గడుస్తున్న కొద్దీ అక్కడికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళన చెందారు. ఎప్పుడైనా ప్రమాదం జరుగుతుందేమోనని కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు, అధికారులు కలిసి ఆమెను కిందికి దింపేందుకు పలు విధాలుగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ హై డ్రామా దాదాపు తొమ్మిది గంటల పాటు ఉత్కంఠ కొనసాగింది.

సబ్-కలెక్టర్ రంగంలోకి… ధైర్యంగా ట్యాంకు ఎక్కిన అధికారి

సాయంత్రం వరకు పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో బాన్స్వాడ సబ్-కలెక్టర్ కిరణ్మయి రాత్రి 8 గంటల ప్రాంతంలో సంఘటన స్థల నికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించిన అనంతరం, ఆమె స్వయంగా ట్యాంకు ఎక్కి విద్యార్థినితో మాట్లా డేందుకు నిర్ణయించారు. ఎత్తైన ట్యాంకుపైకి నెమ్మదిగా ఎక్కుతూ, శ్రావంతితో ప్రశాంతంగా సంభాషణ ప్రారంభించారు. ఆమె భావోద్వేగాలను అర్థం చేసుకుంటూ, ధైర్యం చెప్పి, జీవితం విలువను వివరిం చారు. తల్లిదండ్రులు ఇకపై మందలించరని హామీ ఇవ్వడంతో పాటు, ఆమెకు అవసరమైన మద్దతు అందిస్తామని భరోసా కల్పించారు. సబ్-కలెక్టర్ మాటలకు శ్రావంతి క్రమంగా స్పందించి, చివరకు తన నిర్ణయాన్ని మార్చుకుంది.
అధికారుల సహాయంతో సురక్షితంగా ట్యాంక్ పైనుండి కిందికి దిగడంతో, అక్కడ ఉన్న గ్రామస్తు లందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

కుటుంబ సభ్యులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకు న్నారు.దాదాపు తొమ్మిది న్నర గంటల పాటు కొనసా గిన ఈ హైడ్రామా ఎలాంటి అనర్థం జరగకుండా ముగియడం స్థానికులకు పెద్ద ఊరటనిచ్చింది. సబ్-కలెక్టర్ కిరణ్మయి ప్రదర్శించిన ధైర్యం, సమ యస్ఫూర్తి పట్ల గ్రామస్తులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఘటన నేపథ్యంలో అధికారులు కౌమారదశలో ఉన్న పిల్లలతో తల్లిదండ్రులు సహనంతో వ్యవహరించా లని సూచించారు. చిన్న విషయాలకే భావోద్వేగంగా స్పందించే వయసులో వారికి ప్రేమ, అర్థం చేసుకునే ధోరణి, కౌన్సెలింగ్ ఎంతో అవసరమని తెలిపారు.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...