తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ కమిషన్ ఏర్పాటు
posted on: Feb 3, 2026 3:39PM

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి పై విచారణ కమిషన్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సిట్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలోని అంశాలకు, దాఖలు చేసిన ఛార్జ్ షీట్లోని వివరాలకు మధ్య పొంతన లేకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన కేబినెట్ విచారణలో వెలుగుచూసిన వాస్తవాలు ఛార్జ్ షీట్లో ఎందుకు మరుగున పడ్డాయనే విషయంపై విస్తృతంగా చర్చించింది.
ఈ వైరుధ్యాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి, వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు ప్రత్యేక విచారణ కమిషన్ ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంగళవారం (ఫిబ్రవరి 3) జరిగిన కేబినెట్ సమావేశం పలు కీలక అంశాలపై చర్చించింది.


.webp)
.webp)


