Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మంత్రులు, కార్యదర్శులు బాధ్యతగా ఉండాలి: చంద్రబాబు
posted on: Apr 10, 2026 10:27PM

క్యాబినెట్ అజెండా లీక్ అవుతోందంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో అజెండా లీక్ విషయంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మంత్రులు కార్యదర్శులు బాధ్యతగా ఉండాలని హెచ్చరించారు.
గతంలో బడ్జెట్ లీక్ అయితే 30 మంది మంత్రులు రాజీనామా చేశారని, ఎన్టీఆర్ ఎవరూ లేకుండా 15 రోజులు ప్రభుత్వాన్ని నడిపారని చంద్రబాబు గుర్తు చేశారు. అలాగే. పేపర్ లీక్ కేసులో గతంలో ఓ మంత్రి రాజీనామా చేసిన విషయాన్నీ ప్రస్తావించారు. ఇప్పుడు సాంకేతిక పెరిగిందనీ, ఎవరి నుంచి లీక్ అయ్యిందన్న విషయం సులభంగా గుర్తించవచ్చన్నారు. మంత్రులు, కార్యదర్శులు బాధ్యతగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.






