బెల్జియం దాడులలో ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి

posted on: Mar 29, 2016 11:20AM

 

బెల్జియంలో గతవారం నుంచి కనిపించకుండా పోయిన ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి చెందినట్లు తేలింది. బెల్జియం రాజధాని బ్రెసిల్స్‌ విమానాశ్రయం మీదా, సమీపంలోని రైల్వే స్టేషన్లోనూ జరిగిన ఆత్మాహుతి దాడులలో 35మంది మృతి చెందిన విషయం తెలిసిందే! ఆ రోజు నుంచి ఇన్ఫోసిస్ ఉద్యోగి రాఘవేంద్రన్‌ గణేశ్‌ కూడా కనిపించడం లేదు. రాఘవేంద్రన్‌కు తరచూ మెట్రో రైళ్లలో ప్రయాణం చేసే అలవాటు ఉందని తేలడంతో, దాడులలో అతను కూడా మృతి చెంది ఉంటాడని అంతా భయపడ్డారు.

 

భయపడినట్లే, రాఘవేంద్ర మృతదేహాన్ని బెల్జియం ఆసుపత్రిలో కనుగొన్నారు. అతని శరీరం గుర్తుపట్టలేనంతగా దెబ్బతినిపోవడంతో, రాఘవేంద్ర కుటుంబం మాత్రమే అతని మరణాన్ని ధృవీకరించగలిగింది. ఇన్ఫోసిస్‌ తరఫున గత నాలుగేళ్లుగా బెల్జియంలో పనిచేస్తున్న గణేశ్‌, గత నెలే ఇంటికి వచ్చి వెళ్లాడు. ఘటన జరిగిన కొద్దిసేపటి ముందు కూడా తమతో ఫోన్లో మాట్లాడాడనీ, ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయిందనీ గణేశ్‌ తల్లి వాపోయారు. గణేశ్ కనిపించకుండా పోయిన దగ్గర్నుంచీ, అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌, గణేశ్‌ మృతి పట్ల సంతాపాన్ని తెలియచేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...