" వైఫ్ స్వాపింగ్"..కొచ్చి టూ భువనేశ్వర్

posted on: Jun 16, 2016 10:30AM

నెల రోజుల క్రితం కొచ్చి నావల్‌బేస్‌లో బయటపడిన "వైఫ్ స్వాపింగ్" భారత సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వాడి భార్యను వీడు..వీడి భార్యను వాడు అనే విచ్చలవిడి తనానికి మారుపేరుగా నిలిచే "భార్యల మార్పిడీ పార్టీలు" సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేశాయి. నేవీలో ఉన్నత స్థాయి అధికారులు సరదా కోసం భార్యలను మార్చుకుని ఆనందిస్తూ..ఇదే సంస్కృతిని జూనియర్లకు పరిచయం చేస్తున్నారు. అలాగే కొచ్చి సైనిక స్థావరంలో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారికి "వైఫ్ స్వాపింగ్ పార్టీ"లకు వెళ్లడం అలవాటు. పెళ్లయిన తర్వాత తన భార్యను ఈ పార్టీలో పాల్గొనాల్సిందిగా కోరాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో వేధింపులకు గరిచేసేవాడు. . అతనికి అత్తింటివారు మద్ధతు పలకడంతో ఆమె భరించలేక కొచ్చి హర్బర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన అప్పటి రక్షణ శాఖ మంత్రి "ఏకే ఆంటోని" విచారణకు ఆదేశించారు. రోజులు గడుస్తున్నా న్యాయం జరగకపోవడంతో బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

 

దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరుపుతుండగానే మరోసారి "వైఫ్ స్వాపింగ్" కలకలం రేగింది. ఈ సారి ప్లేస్ కొచ్చి నుంచి భువనేశ్వర్‌కు షిఫ్ట్ అయ్యింది. ఒడిషాలో ప్రముఖ పారిశ్రామికవేత్త త్రైలోక్యనాథ మిశ్రా కోడలు లోపాముద్ర మిశ్రా తాను "వైఫ్ స్వాపింగ్‌"కు ఒప్పుకోకపోవడంతో తనను అత్తింటివారు వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించడం ఆ రాష్ట్రంలో సంచలనం కలిగించింది. 2006 జనవరి 27న త్రైలోక్యనాథ మిశ్రా కుమారుడు సవ్యసాచి మిశ్రాతో ఆమెకు వివాహం జరిగింది.

 

లోపాముద్ర మిశ్రా భర్తతో కలిసి పెళ్లయిన కొత్తలో హానీమూన్ కోసం విదేశీ పర్యటనకు వెళ్లారు. అయితే అక్కడ "వైఫ్ స్వాపింగ్‌ పార్టీ"కి రావాల్సిందిగా భర్త అడగటంతో అందుకు ఆమె నిరాకరించింది. అయితే అది అక్కడితో అయిపోయిందని లోపాముద్ర భావించింది. కాని భర్త తరచూ ఇదే రకమైన ఒత్తిడి తెస్తుండటంతో పెద్దింటి కోడలిగా సంయమనంతో వ్యవహారించారు. భర్త వేధింపులకు అత్త ఆశా మంజరి, మామ త్రైలోక్యనాథ మిశ్రా మద్థతు ఇవ్వడంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. చివరికి ఓపిక నశించి ఆమె స్థానిక మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మామగారికి ఉన్న పలుకుబడి కారణంగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.  తనను హత్య చేస్తామని..తన కుమారుడిని అపహరిస్తామని అత్తింటి వారు బెదిరించారని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసి ఎన్నిరోజులనైప్పటికి పోలీసుల నుంచి కనీస స్పందన రాకపోవడంతో ఆమె నగర డీసీపీని ఆశ్రయించి న్యాయం చేయాల్సిందిగా వేడుకున్నారు. దీనికి స్పందించిన ఆయన విచారణకు ఆదేశించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...